Vettaiyan Day 6 Collection:వసూళ్లు తగ్గినా బాక్సాఫీస్ రేసులో రజనీ ముందంజ..6వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?

Vettaiyan Day 6 Collections: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ చక్రవర్తి అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ 'వేట్టయాన్' (Vettaiyan). ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఇద్దరు సూపర్‌స్టార్‌లను ఒకే స్క్రీన్ పై కనిపించడంతో ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.ఈ మూవీని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ భారీ బడ్జెట్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. కలెక్షన్ల పరంగా చూస్తే.. కాస్త బెటరే అనిపిస్తోంది. ఈ క్రమంలో వేట్టయాన్ మూవీ ఆరో రోజు మొదటి మంగళవారం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.

TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయాన్'మూవీలో రజనీకాంత్ హీరోలో నటించగా.. బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా నిర్మించారు. ఈ యాక్షన్ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులతో సహా మొత్తం బడ్జెట్ 300 కోట్లు వరకు వెచ్చించారట. వాస్తవానికి ఈ మూవీకి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు రజనీకాంత్ నటన, సాంకేతిక అంశాలను ప్రశంస్తుంటే.. మరికొందరూ కథాంశం, స్లో స్క్రీన్‌ప్లేను విమర్శిస్తున్నారు.

Vettaiyan Day 6 Box Office Collections Worldwide movie sees massive drop on second week

ఇక రజనీకాంత్ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే.. వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్లు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో స్థానం సంపాందించుకుంది. విజయ్ 'ది గోట్' రూ.120 కోట్లు కలెక్షన్లు సాధించగా తొలిస్థానంలో నిలువగా.. 'వేట్టయాన్'తొలి రోజు పాన్ ఇండియా వైడ్ గా రూ.31.7 కోట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వేట్టాయన్ తొలిరోజు రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రెండవ స్థానంలో నిలిచింది.

అయితే.. రెండవ రోజు ఫిగర్.. రూ. 24 కోట్లకు పడిపోయింది. ఇక మూడో రోజు రూ.26.75 కోట్లు రాబట్టి కాస్త బెటర్ అనిపించింది. ఇక నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే రూ.50 కోట్ల మార్క్‌ను రెండు రోజుల్లో క్రాస్ చేయగా.. రూ.100 కోట్ల మార్క్‌ను ఈ సినిమా 4 రోజుల్లో దాటింది. ఇలా మొదటి వారాంతంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెట్టయాన్ రూ.104.75 కోట్లకు కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు రూ. 200 కోట్లకు చేరువైంది.

Vettaiyan Day 6 Box Office Collections Worldwide movie sees massive drop on second week

వేట్టయాన్ 5వ రోజు కలెక్షన్లు పడిపోతున్నాయి. దాదాపు 70 % వసూళ్లు క్షిణీంచాయి. పాన్ ఇండియా వైడ్ గా కేవలం రూ.5.60 కోట్లు వసూలు చేయగా..ప్రపంచ వ్యాప్తంగా (ఓవర్సీస్ తో కలుపుకుని) రూ. 8 నుంచి 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఇక వేట్టయాన్ ఆరో రోజు కలెక్షన్ల గురించి చెప్పాలంటే.. మంగళవారం కూడా మూవీ కలెక్షన్లు పడిపోయాయి. Sacknilk రిపోర్ట్ ప్రకారం.. ఆరో రోజు వేట్టయాన్ కేవలం రూ. 4.25 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 114.60 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

దసరా సందర్భంగా 'వెట్టయన్'తో పాటు అలియా భట్ 'జిగ్రా', రాజ్‌కుమార్ రావు 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' విడుదలయ్యాయి. వసూళ్ల పరంగా 'జిగ్రా', 'విక్కీ విద్యా కా వో వీడియో' కంటే ఈ సినిమా వేట్టయాన్ చాలా ముందుంది. అలియా నటించిన 'జిగ్రా'20 కోట్లు రాబట్టడానికి కూడా చాలా కష్టపడుతోంది. రాజ్‌కుమార్ రావ్ 'విక్కీ విద్యా క వో వాలా వీడియో' కూడా రూ.20 కోట్ల మార్కును దాటడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ రెండు చిత్రాలతో పోలిస్తే 'వెట్టయన్' రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండవ వారంలో వేట్టయాన్ వసూళ్లు పెరుగుతాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X