Vettaiyan Day 7 Collection: బాక్సాఫీస్ దగ్గర రజనీ వసూళ్ల వేట.. 7 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 7 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'వేట్టయాన్'(Vettaiyan). ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదలైంది. దాదాపు మూడున్నర దశబ్దాల తరువాత రజనీ కాంత్, బిగ్ బీ అమితాబ్ కలిసి నటించిన చిత్రం వేట్టయాన్. ఈ మూవీలో ఇద్దరు సూపర్‌స్టార్‌లను ఒకే స్క్రీన్ పై కనిపించడంతో ఎగ్జైటింగ్ గా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వర్డల్ వైడ్ గా విడుదలైన ఈ భారీ బడ్జెట్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త బెటరే అనిపిస్తోంది. ఈ క్రమంలో వేట్టయాన్ మూవీ ఏడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.
జై భీం ఫేమ్ డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయాన్'మూవీలో రజనీకాంత్ , బాలీవుడ్ బీ బిగ్ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మల్లీ స్టార్ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా నిర్మించారు. ఈ యాక్షన్ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులతో సహా మొత్తం బడ్జెట్ 300 కోట్లు వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. రజనీకాంత్ నటన, సాంకేతిక అంశాలు ఈ మూవీకి ఫ్లస్ అంటుంటే.. కథాంశం బాగాలేదనీ, స్లో స్క్రీన్‌ప్లే మైనస్ అంటున్నారు.

ఇక రజనీకాంత్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ ఫస్ట్ డే కలెక్షన్లు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో స్థానం సంపాందించుకుంది వేట్టయాన్ ది హంటర్. విజయ్ 'ది గోట్' రూ.120 కోట్లతో తొలిస్థానంలో నిలువగా.. 'వేట్టయాన్' తొలిరోజు వర్డల్ వైడ్ గా రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తరువాత స్థానంలో నిలిచింది.
మిక్స్డ్ టాక్ రావడంతో రెండవ రోజు కలెక్షన్లు రూ. 24 కోట్లకు పడిపోయింది. ఇక మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే రూ.50 కోట్ల మార్క్‌ను రెండు రోజుల్లో క్రాస్ చేయగా.. రూ.100 కోట్ల మార్క్‌ను ఈ సినిమా 4 రోజుల్లో దాటింది. ఇలా మొదటి వారాంతంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెట్టయాన్ రూ.104.75 కోట్లకు కలెక్ట్ చేసింది.
మరోవైపు.. ప్రపంచ వ్యాప్తంగా మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.240 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ లైకేవ్ అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో సినిమా చూసేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో కలెక్షన్ల చాలా తగ్గాయి. దీంతో వేట్టయాన్ 5వ రోజు నుంచి కలెక్షన్లు పడిపోతున్నాయి. ఒక్క 5 రోజే దాదాపు 70 % వసూల్లు పడిపోయాయి.

ఇలా వేట్టయాన్ 5 వ రోజు..కేవలం రూ.5.60 కోట్లు వసూలు చేయగా..ప్రపంచ వ్యాప్తంగా (ఓవర్సీస్ తో కలుపుకుని) రూ. 8 నుంచి 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక 6వ రోజు ఈ సినిమా అత్యల్పంగా రూ.4.3 కోట్లు వసూలు చేసింది. ఏది ఏమైనప్పటికీ, 7వ రోజు వెట్టాయన్ మూవీ కలెక్షన్లు కాస్త మెరుగుపడ్డాయి.
వెట్టయన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 7 Sacnilk ప్రకారం..రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ల చిత్రం 7వ రోజున రూ. 4.5 కోట్లు రాబట్టింది. ఈ సినిమా నికర వసూళ్లు రూ. 118.80 కోట్లు చేరింది. ఇది థియేటర్లలో మొత్తం 19.34 శాతం తమిళ ఆక్యుపెన్సీ, 14.00 శాతం తెలుగు ఆక్యుపెన్సీ, 5.99 శాతం హిందీ ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేట్టయాన్ వారం రోజుల్లో గ్రాస్ కలెక్షన్ 211 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది అంచనా లెక్కలు మాత్రమే.. అధికారికం లెక్కలను మూవీ మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











