Vettaiyan Day 9 Collection: రజనీ కలెక్షన్ల వేట ముగిసినట్లేనా.. 9 వ రోజు వేట్టయాన్ కు ఎన్ని కోట్లంటే?
Vettaiyan Day 9 Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ - బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ 'వేట్టయాన్'(Vettaiyan). ఈ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయిన విషయం తెలిసిందే. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ కాంబోలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ వేట్టయాన్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త బెటరే అనిపిస్తోంది. ఇంతకీ వేట్టయాన్ విడుదలైన తొమ్మిది రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఓ లూక్కేయండి.
జై భీం ఫేమ్ డైరెక్టర్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన వేట్టయాన్ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లతో పాటు.. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మల్లీ స్టార్స్ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లి రాజా నిర్మించారు. ఈ యాక్షన్ మూవీ కోసం దాదాపు 300 కోట్లు వరకు ఖర్చు చేసినట్టు టాక్.

ఇక రజనీకాంత్ వేట్టయాన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. వేట్టయాన్ విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ లో రికార్డు చేశారు. ఈ ఏడాది కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో చేరింది. విజయ్ 'ది గోట్' రూ.120 కోట్లతో తొలిస్థానంలో నిలుగా.. రెండవ స్థానం దక్కించుకుంది వేట్టయాన్ ది హంటర్.
'వేట్టయాన్' తొలిరోజు వర్డల్ వైడ్ గా రూ. 68.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. మిక్స్డ్ టాక్ రావడంతో రెండవ రోజు కలెక్షన్లు రూ. 24 కోట్లు, మూడో రోజు రూ.26.75 కోట్లు, నాలుగో రోజు రూ. 22.30 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచ వ్యాప్తంగా (మొదటి నాలుగు) రోజుల్లో ఈ చిత్రం రూ.240 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ లైకేవ్ అధికారికంగా ప్రకటించింది.

ఇక 5 వ రోజు నుంచి కలెక్షన్లు పడిపోయాయి. 5 వ రోజు వేట్టాయన్ కేవలం రూ.5.60 కోట్లు వసూలు చేయగా.. ఇక 6వ రోజు అత్యల్పంగా రూ.4.3 కోట్లు వసూలు చేసింది. 7వ రోజు వెట్టాయన్ మూవీ కలెక్షన్లు కాస్త మెరుగుపడి..రూ. 4.5 కోట్లు రాబట్టింది. ఇక 8 వ రోజు కేవలం రూ. 3.15 కోట్లు (నెట్) మాత్రమే రాబట్టింది.
ఇక వేట్టయాన్ తొమ్మిదో రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే.. ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకింగ్ పోర్టల్ సక్‌నిల్క్ ప్రకారం.. వెట్టయన్ తొమ్మిదవ రోజు నాడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 2.65 కోట్లు (నెట్ ) కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ వేట్టయాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం ₹125 కోట్లు ఆర్జించినట్టు తెలుస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టి జనజీవనం మెల్లగా సాధారణ జీవితానికి రావడంతో థియేటర్ కు వచ్చే అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో సినిమాకు కలెక్షన్లు పెరుగుతాయని, సూపర్ స్టార్ అభిమానులు ట్విట్టర్‌లో #Vettaiyan300CroreBOHunt ట్రెండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











