Vettaiyan Box Office: విజయ్ రికార్డుకు చేరువగా రజనీకాంత్.. వేట్టయన్‌కు ఎన్ని కోట్లంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ నటించిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ తొలి రోజు కోసం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో రజనీకాంత్ మేనియా భారీగా కనిపిస్తున్నది. ఈ సినిమా తమిళనాడులో సుమారుగా 16 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఇక ఈ చిత్రం తెలుగులో 2 కోటి రూపాయలు వసూలు చేసింది. హిందీలో ఈ మూవీ మరో 2 రూపాయలు వసూలుచేసింది. దాంతో ఇండియా వైడ్ ఈ సినిమా 20 కోట్లకుపైగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

ఆన్‌లైన్ టికెటింగ్ వెబ్‌సైట్ బుక్ మై షోలో వేట్టయన్ చిత్రానికి అభిమానుల నుంచి మంచి ఊపు కనిపిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 4.5 లక్షలకుపైగా టికెట్లను అమ్మడం జరిగింది. తద్వారా ఈ సినిమా 6.45 కోట్ల రూపాయలు తమిళనాడులోనే కలెక్ట్ చేసింది. చెన్నైలో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 4.5 కోట్లు వసూలు చేసింది.
వేట్టయన్ చిత్రానికి ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకు 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అమెరికాలోనే 1 మిలియన్ డాలర్లు రిలీజ్‌కు ముందే రాబట్టింది. దాంతో ఈ సినిమా 17 కోట్ల రూపాయలు రాబట్టింది. అక్టోబర్ 10వ తేదీ ఉదయానికి ఇంకా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక వేట్టయన్ చిత్రం ఇండియాలో 20 కోట్లకుపైగా వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 17 కోట్లకుపైగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 37 కోట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్ట్ చేసింది. అయితే కరెంట్ బుకింగ్‌తో కలిపి ఈ సినిమా తొలి రోజు 50 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుందని వెల్లడించారు.
తమిళ సినిమా రంగంలో ఇటీవల తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ విషయంలో రికార్డు సృష్టించిన చిత్రాల విషయానికి వస్తే.. లియో చిత్రం 103 కోట్లు రాబట్టింది. అలాగే గోట్ సినిమా 65 కోట్లు, జైలర్ చిత్రం 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తాజాగా వేట్టయన్ చిత్రం 37 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. టాప్ స్థానాల్లో రెండు విజయ్ సినిమాలు, రెండు రజినీకాంత్ చిత్రాలు ఉండటం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











