Chhaava Day 15 Collections : స్త్రీ 2 రికార్డు ఔట్.. విక్కీ కౌశల్ మాస్ తాండవం, 15వ రోజు ఎన్ని కోట్లంటే?

చారిత్రక కథాంశం, దేశభక్తి ఇతివృత్తంతో తెరకెక్కిన ఛావా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. వర్కింగ్ డే, హాలీడే అన్న తేడా లేకుండా కలెక్షన్లు కుమ్మిపారేస్తోంది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా ఈ సినిమాకు ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఇప్పటికే రూ.550 కోట్లకు పైగా వసూళ్లతో పలు చిత్రాల బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొట్టింది ఛావా. తాజాగా 15వ రోజు విక్కీ కౌశల్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పరిపాలన, మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో చేసిన యుద్ధం, ఆయన జీవితంలోని యదార్ధ సంఘటనల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందజేశారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాకు నిర్మాణం వహించారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 15 Box Office Collections Worldwide

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఛావాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. నాటి నుంచి నేటి వరకు థియేటర్లలో కంటతడి పెట్టని వారు లేరు, సినిమాలో లీనమైపోయి శంభాజీ మహారాజ్‌కి జై అంటూ ప్రేక్షకులు నినాదాలు చేస్తున్నారు. విడుదలైన తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఛావా.. నాటి నుంచి నేటి వరకు అదే ఆదరణను పొందుతోంది. భాష రాకపోయినా దేశ ప్రజలు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు.

ఇక బాక్సాఫీస్ లెక్కలు పరిశీలిస్తే తొలి వారంలో రూ.220 కోట్లు రాబట్టిన ఛావా.. రెండో వారంలో రూ.182 కోట్లు రాబట్టి అదే జోరును కొనసాగిస్తూ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రెండో వారంలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 తర్వాతి స్థానంలో ఛావా నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డు శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 (రూ.141 కోట్లు) ఉండేది. ప్రస్తుతం ఛావా రెండో వారంలో ఏకంగా రూ.182 కోట్ల వసూళ్లతో స్త్రీ 2 రికార్డును బద్ధలు కొట్టింది.

ఇక రెండో వారంలోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో గదర్ 2, యానిమల్, జవాన్, దంగల్, ది కశ్మీర్ ఫైల్స్ నిలిచాయి. అయితే ఛావా రెండో వారంలో రూ.150 కోట్లకు పైగా రాబట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొలి వారంతో పోలిస్తే ఈ చిత్రానికి కేవలం 16 శాతం మాత్రమే బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి.

15వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. శుక్రవారం ఛావాకు స్వల్పంగా బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. అయినప్పటికీ ఫస్ట్ షో, సెకండ్ షోలకు బాగానే హోల్డ్ చేసింది ఈ సినిమా. 15వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.14 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా.. మొత్తంగా రూ.567 కోట్ల కలెక్షన్స్ అందుకుని దూసుకెళ్తోంది. శనివారం నుంచి వీకెండ్ మొదలుకావడంతో ఛావా కలెక్షన్స్ అదిరిపోతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి విక్కీ కౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X