Chhaava Day 17 Collections : 600 కోట్లతో విక్కీ కౌశల్ సంచలనం.. 17వ రోజు ఎన్ని కోట్లంటే?

మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్, వర్కింగ్ డే అన్న తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. మధ్యలో ఒకటి రెండు రోజులు తప్పించి 16 రోజుల వరకు ఛావా చిత్రం మాస్ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లతో విక్కీ కౌశల్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 17వ రోజు ఛావా సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఛావాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 17 Box Office Collections Worldwide

మార్నింగ్ షో దగ్గరి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఛావా. విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. థియేటర్లలో జై భవానీ, జగదాంబ, హరహర మహాదేవ , జై ఛత్రపతి శివాజీ, జై ఛత్రపతి శంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. సినిమా చూస్తున్నంతసేపు చిన్నారులు, పెద్దలు ఏడుస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛావా చిత్రంతో మరాఠాల చరిత్ర, శివాజీ, శంభాజీ, ఔరంగజేబుల గురించి ప్రజలు డిస్కష్ చేయడంతో పాటు పుస్తకాలు తిరగేస్తున్నారు.

ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా ఛావా సినిమాను ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడంతో పాటు థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు. మార్చి 7న ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండగా .. మరిన్ని భాషల్లో అనువదించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదలైన మూడో ఆదివారం పలు రికార్డులు బద్ధలయ్యాయి. 17వ రోజు మార్నింగ్ షోలలో దాదాపు 28.95 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లను రాబట్టింది ఛావా. వీకెండ్‌లో పుంజుకున్న విక్కీ కౌశల్ చిత్రం శనివారం దాదాపు రూ.23 కోట్ల కలెక్షన్లను అందుకోగా.. 17వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.26 కోట్లను వసూలు చేసి రూ. 600 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో వరుసగా మూడోసారి రూ.500 కోట్ల మార్క్ అందుకున్నారు రష్మిక మందన్న. ఆమె గత చిత్రాలు యానిమల్, పుష్ప 2లు ఈ ఫీట్ అందుకున్న సంగతి తెలిసిందే. రూ.600 కోట్ల కలెక్షన్స్‌తో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 25 భారతీయ చిత్రాల్లో ఛావా నిలిచింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభం కానుండటంతో ఛావా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X