Chhaava Day 18 Collections : సలార్ కలెక్షన్లు ఔట్.. విక్కీ మాస్ కుమ్ముడు, 18వ రోజు ఎన్ని కోట్లంటే?

గత కొద్దినెలలుగా బాలీవుడ్‌పై టాలీవుడ్ ఆధిపత్యం చూపిస్తోంది. గతేడాది హనుమాన్, కల్కి 2898 ఏడీ, పుష్ప 2 వంటి చిత్రాలతో బాలీవుడ్‌ వణికిపోయింది. హిందీ స్ట్రెయిట్ సినిమాలను మించిన వసూళ్లతో ఇవి దుమ్మురేపాయి. హిందీలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచిందంటే టాలీవుడ్ డామినేషన్‌ను అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది వచ్చిన విక్కీ కౌశల్ - రష్మికల ఛావా చిత్రం తిరిగి బాలీవుడ్‌కు ఊపిరి పోసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో 18వ రోజు ఛావా సినిమా ఎన్ని కోట్ల వసూళ్లను సాధించిందో చూస్తే :

మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలోని యదార్ద సంఘటనల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు..

మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాకు నిర్మాణ సారథ్యం వహించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఛావాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 18 Box Office Collections Worldwide

విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఛావా. థియేటర్‌లలో ప్రేక్షకులు భావోద్వేగాలను నియంత్రించుకోలేక కంటతడి పెడుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రైలర్, టీజర్లకు తోడు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. విక్కీ, రష్మికల అభిమానులు కూడా సినిమాకు బాగానే పబ్లిసిటీ చేస్తున్నారు.

ఇక ఛావా బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లను రాబట్టింది . వర్కింగ్ డేస్‌తో కాస్త డల్ అయినప్పటికీ వీకెండ్‌లో శని, ఆదివారాలు కలిపి ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. 18వ రోజు వర్కింగ్ డే కావడంతో సోమవారం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆదివారం కంటే రూ.15 కోట్లు తక్కువగా కేవలం రూ.10 కోట్లు మాత్రమే రాబట్టింది.

వీటితో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.630 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది ఛావా. ఈ వసూళ్లతో ప్రశాంత్ నీల్ - ప్రభాస్‌ల సలార్ చిత్రం సాధించిన టోటల్ కలెక్షన్స్‌ని దాటేసింది విక్కీ కౌశల్ చిత్రం. ఈ వారంలో ఛావా తెలుగులో రిలీజ్ కానున్న నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది? ఎన్ని రికార్డులు నెలకొల్పుతుంది? అనేది ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X