Chhaava Day 10 Collections : తుక్కురేగ్గొడుతోన్న చావా.. మోడీ కాంప్లిమెంట్‌తో కలెక్షన్ల వర్షం, ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్.. యానిమల్, పుష్ప 2 చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్న జంటగా దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పాపులర్ ప్రొడ్యూసర్, స్త్రీ 2 ఫేమ్ దినేష్ విజాన్ నిర్మించారు. హిందీ నాట ప్రముఖ సినీ నిర్మాణ సంస్థగా ఉన్న మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా 10వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ అలరించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. దేశభక్తిని రగలించే ఈ సినిమాలో సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 10 Box Office Collections Worldwide

ఛావా సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు భారీగా నమోదు అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. తొలుత ఈ మూవీని ఇండియాలో 4500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కానీ ప్రేక్షకుల నుంచి ఆదరణ రోజు రోజుకు పెరుగుతుండటంతో స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు.

టీజర్, ట్రైలర్లు, శంభాజీగా విక్కీ కౌశల్ పోస్టర్లు వైరల్ కావడంతో ఛావా థియేటర్లకు జనం పరుగులు తీశారు. మార్నింగ్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న చావా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్‌తో తొలి రోజు 31 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీని గ్రాండ్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత తొలి రోజు కంటే ఎక్కువగా ప్రతీ రోజు కలెక్షన్లను పెంచుకొంటూ వెళ్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రం తొలివారం ముగిసే సమయానికి ఇండియాలో 220 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఫస్ట్ వీక్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఛావా రెండో వారంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. 8వ రోజున ఈ చిత్రం 24 కోట్ల నేషనల్ బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. ఇక రెండో శనివారం అంటే తొమ్మిదో రోజున అంతకు మించి అనేలా 44 కోట్లకుపైగా కలెక్షన్లను అందుకుంది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 287 కోట్లకుపైగా రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో అయితే ఎన్నారై ప్రేక్షకులు ఛావా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, గల్ఫ్ దేశాల్లో భారీ వసూళ్లతో సునామీని క్రియేట్ చేసింది ఛావా. గడిచిన 9 రోజుల్లో ఒక్క ఓవర్సీస్ మార్కెట్‌లోనే ఏకంగా రూ. 55 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసి దుమ్మురేపింది. మొత్తంగా విక్కీ కౌశల్ చిత్రం 9 రోజుల్లో 342 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది.

ఇక రెండో ఆదివారం అయిన 10వ రోజు వసూళ్ల విషయానికి వస్తే .. మౌత్ టాక్, రివ్యూలకు తోడు సోషల్ మీడియాలో ఈ సినిమా సీన్లు చక్కర్లు కొడుతుండటం, థియేటర్‌లలో అంతా కన్నీటితో కనిపించిన దృశ్యాలు వైరల్ కావడంతో ఛావాకు యువత పరుగులు తీస్తున్నారు. దీంతో 10వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్‌ ఓ రేంజ్‌లో జరుపుకుంది. ఆదివారం ఉదయం అంతంత మాత్రంగా ఉన్న బుకింగ్స్.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హౌస్‌ఫుల్‌కు చేరుకున్నాయి.

మొత్తం మీద విక్కీ కౌశల్ - రష్మిక మందన్నల చిత్రం 10 రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 44 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సోమవారంతో 400 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 2025లో తొలి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సినిమాను మెచ్చుకోవడం చావాకు ప్లస్ అయ్యిందని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X