Chhaava Day 11 Collections : ఛావా సింహగర్జన.. వర్కింగ్ డేలోనూ కలెక్షన్ల జాతర, ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దినేష్ విజాన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా పది రోజులు కావొస్తున్నా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 11వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటించారు. డయానా పెంటీ స్పెషల్ రోల్ అలరించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫి, మనీష్ ప్రధాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 11 Box Office Collections Worldwide

ఛావా సినిమాలో స్టార్ యాక్టర్లు, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేయడంతో పారితోషికాలు భారీగా నమోదు అయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 130 కోట్ల రూపాయలుగా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. తొలుత ఈ మూవీని ఇండియాలో 4500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. కానీ ప్రేక్షకుల ఆదరణ నేపథ్యంలో స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు.

టీజర్, ట్రైలర్లు, శంభాజీగా విక్కీ కౌశల్ పోస్టర్లు వైరల్ కావడంతో ఛావా థియేటర్లకు జనం పరుగులు తీశారు. మార్నింగ్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న చావా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజు రూ.31 కోట్ల ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీని గ్రాండ్‌గా ప్రారంభించింది చావా. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలైంది. ప్రేక్షకులు ఈ థియేటర్‌కు పరుగులు తీస్తుండటంతో తొలి రోజును మించి కలెక్షన్ల వర్షం కురుస్తూ వెళ్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అలా విక్కీ కౌశల్ మూవీ తొలివారం ముగిసేసరికి ఇండియాలో 220 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇప్పటి వరకు చావా సినిమా రూ. 334 కోట్ల నికర వసూళ్లను, రూ.444 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇక హిందీలో 10 రోజుల లోపే రూ.109 కోట్లు రాబట్టి స్త్రీ 2, గదర్ 2, యానిమల్, పఠాన్, దంగల్ , సంజూ పేరిట ఉన్న రికార్డులను బద్ధలు కొట్టింది. అయితే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయింది. పుష్ప 2 సెకండ్ వీకెండ్‌లో కలెక్ట్ చేసిన ర.128 కోట్ల రికార్డు పదిలంగానే ఉంది. ఇక ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగానే ఆదరిస్తున్నారు. 10 రోజుల వరకు ఛావా చిత్రానికి రూ. 7 మిలియన్లకు పైగా (భారతీయ కరెన్సీలో రూ.61 కోట్లు)పైనే వసూళ్లు దక్కాయి.

ఇక 11వ రోజు చావా వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలనే విస్మయపరిచింది. వర్కింగ్ డేలోనూ అది కూడా 11వ రోజు ఇలాంటి వసూళ్లు రావడం మామూలు విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కలెక్షన్స్‌తో ఛావా రూ.500 కోట్ల మార్క్‌కు దగ్గరైంది.. శివరాత్రి లోపే విక్కీ కౌశల్ మూవీ ఈ ఫీట్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి లాంగ్ రన్‌లో ఛావా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X