Chhaava Day 12 Collections :సంక్రాంతికి వస్తున్నాం ఔట్.. ఛావా వసూళ్ల జాతర, రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?

ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.40 కోట్లకు వసూళ్లతో దూసుకెళ్తోంది. పాజిటివ్ రివ్యూలు, థియేటర్లలో భావోద్వేగ సన్నివేశాలు , సోషల్ మీడియాలో డిస్కషన్ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఛావాలో ఛత్రపతి శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి రాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా ఇతర కీలకపాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికంగా ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి ఛావా సినిమాకు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్ అయ్యింది. మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఈ సినిమాకు నిర్మాణం వహించారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 12 Box Office Collections Worldwide

టీజర్, ట్రైలర్లు, శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ లుక్, దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలు చావాపై భారీ అంచనాలు తీసుకొచ్చాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఛావాను గ్రాండ్‌గా విడుదల చేశారు. భారత్‌లో 4500 స్క్రీన్‌లలో.. వరల్డ్ వైడ్‌గా 5500 థియేటర్‌లలో రిలీజ్ చేశారు. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న చావాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో అన్ని చోట్లా థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు.

గత వీకెండ్‌లో దుమ్మురేపిన ఛావా వర్కింగ్ డేస్‌లోనూ మాస్ జాతర చూపిస్తోంది. 11 రోజుల వ్యవధిలోనే రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన విక్కీ కౌశల్ చిత్రం 12వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే . విడుదలై 12 రోజులు కావొస్తున్నా నేటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది ఛావా. 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా రష్మిక మందన్న చిత్రం రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది . దీనితో కలిపి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.485 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టగా.. ఇందులో ఇండియా నుంచే రూ.415 కోట్ల వసూళ్లు ఉన్నాయి. అలాగే ఓవర్సీస్ నుంచి రూ. 70 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 12 Box Office Collections Worldwide

ఈ వసూళ్లతో ఛావా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. మంగళవారం వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 444.5 వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా , అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాంను అధిగమించింది.

మహాశివరాత్రికి తోడు మార్కెట్‌లో మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఛావా తన ప్రభంజనాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం సెలవు దినం కావడంతో పాటు రెండ్రోజుల్లో వీకెండ్ ప్రారంభం కానుండటంతో విక్కీ కౌశల్ - రష్మిక మందన్నల చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X