Chhaava Collections:550 కోట్లతో విక్కీ కౌశల్ హిస్టరీ..వార్, టైగర్ 3 రికార్డులు బ్రేక్..13వ రోజు ఎన్ని కోట్లంటే

విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఛావా చిత్రం తన ప్రభంజనం కొనసాగిస్తూనే ఉంది. రెండు వారాలకు చేరువ అవుతున్నా అదే జోరు చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.450 కోట్లకు పైగా వసూళ్లతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచి పలు సినిమాల రికార్డులను బద్ధలుకొట్టింది. ఈ నేపథ్యంలో 13వ రోజు విక్కీ కౌశల్ మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్స్ సాధించిందో చూస్తే :

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా నేషనల్ క్రష్ రష్మిక నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందజేశారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 13 Box Office Collections Worldwide

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఛావా విడుదలైంది. తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న చావాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఛావాకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుండగా.. ప్రాంతీయ భాషల్లో రిలీజైతే బాగుండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు కూడా ఆన్‌లైన్‌లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

దీనిలో భాగంగా తెలుగులో ఛావాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మార్చి 7న తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. శంభాజీ మహారాజ్ జీవితాన్ని, ధర్మ పరిరక్షణను మరింత మందికి చేర్చాలనే ఉద్దేశంతోనే తెలుగులోనూ ఛావాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే .. శివరాత్రి పర్వదినం కావడంతో ఛావాకు బాగా కలిసొచ్చింది. 13వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 23 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తద్వారా ఈ సినిమా రూ. 550 కోట్ల మార్క్ చేరుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తద్వారా ఛావా పలు హిందీ రికార్డులను బద్ధలుకొట్టింది. ట్రేడ్ వర్గాల నివేదికలను బట్టి.. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఛావా 18వ స్థానంలో నిలిచింది.

వార్ (466.82 కోట్లు), డుంకీ ( రూ.470.60 కోట్లు), టైగర్ 3 (రూ.472.77 కోట్లు), సంజూ (రూ.541.76 కోట్లు) చిత్రాల రికార్డులను అధిగమించి భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. త్వరలో వీకెండ్ మొదలుకానున్న నేపథ్యంలో ఛావా ఇంకెన్ని కోట్లు రాబడుతుందోనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి విక్కీ కౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X