Chhaava Day 14 Collections : ఛావా జోరుకు బ్రేకులు.. షాకిచ్చేలా కలెక్షన్స్‌, 14వ రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఛావా. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్, వరుస విజయాలతో జోరు మీదున్న రష్మిక మందన్నలు కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. రోజు రోజుకు వసూళ్లు పెంచుకుంటూ సరికొత్త బెంచ్ మార్క్‌లు సృష్టిస్తోంది ఛావా. ఈ నేపథ్యంలో 14వ రోజు విక్కీ కౌశల్ - రష్మిక మందన్నల చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే :

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలోని యదార్ధ సంఘటనల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందజేశారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 14 Box Office Collections Worldwide

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఛావా విడుదలైంది. హిందీ బెల్ట్‌తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని భాషల ప్రజలు ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాతి నుంచి ప్రభంజనం సృష్టించింది. థియేటర్‌ నుంచి కన్నీళ్లతో బయటికొస్తున్న జనాలు, థియేటర్‌లో శివాజీ, శంభాజీ మహారాజ్‌లను తలచుకుంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఛావా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

తమకు హిందీ రాకపోయినా దేశ ప్రజలు ఈ సినిమాను ప్రాంతాలకు అతీతంగా ఆదరిస్తున్నారు. అయితే ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనిలో భాగంగా మార్చి 7న తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. ఇక బాక్సాఫీస్ గణాంకాల విషయానికి వస్తే తొలి వారంలో రూ.220 కోట్లు రాబట్టిన ఛావా.. 13వ రోజు వరకు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాగే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ తన దూకుడు కొనసాగిస్తోంది.

రెండు వారాలు గడుస్తున్నా ఆక్యూపెన్సీ విషయంలో చావా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 13వ రోజు భారతదేశ వ్యాప్తంగా దాదాపు 6000 వేలకు పైగా షోలు పడటం విశేషం. పుణేలో ఏకంగా 717 షోలు పడగా.. సరాసరి 50 శాతానికి పైగా ఆక్యూపెన్సీ నమోదైంది. ఢిల్లీలో 1200కు పైగా షోలు .. 27.75 శాతం ఆక్యూపెన్సీ నమోదు చేసింది ఛావా. మహా శివరాత్రి పర్వదినం నాడు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఛావా.. 14వ రోజు స్వల్పంగా తన దూకుడు తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా గురువారం కేవలం రూ.13 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచి తిరిగి వీకెండ్ మొదలు కానుండటంతో కలెక్షన్స్ అదిరిపోతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. చూద్దాం మరి విక్కీ కౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X