Chhaava Day 16 Collections : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఛావా.. విక్కీ కౌశల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది ఛావా. విక్కీ కౌశల్ నట విశ్వరూపానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై 15 రోజులు గడుస్తున్నా ఏమాత్రం ఊపు తగ్గడం లేదు. త్వరలో తెలుగులో రిలీజ్ కానున్న ఛావా కలెక్షన్ల పరంగా కొత్త లెక్కలు సెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16వ రోజు ఈ చిత్రం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే :
మరాఠాల ఆరాధ్య ధైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి మహారాష్ట్ర వాసులకు తప్పించి దేశ ప్రజలకు అంతగా తెలియదు. ఆయన పరిపాలన ఎలా సాగింది? ధర్మ స్థాపన కోసం శంభాజీ ఎలాంటి త్యాగం చేశారు? మొగల్ చక్రవర్తి ఔరంగజేబును ఎలా ఎదిరించాడు? అనే చారిత్రక ఘటనల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు.

అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందజేశారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఛావాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. టీజర్లు, ట్రైలర్లు, విక్కీ కౌశల్ లుక్స్, గెటప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఛావా వేగంగా జనాల్లోకి వెళ్లింది.
ప్రేక్షకుల నుంచి ఆదరణ పెరుగుతుండటంతో ఛావాకు థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు నిర్మాతలు. కేవలం హిందీలోనే విడుదల చేసినప్పటికీ ఇతర ప్రాంతాల ప్రజలు కూడా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ లోటును తీర్చి అందరికీ సినిమాను అందుబాటులో తెచ్చేందుకు గాను ప్రాంతీయ భాషల్లో ఛావాను అనువదించి విదుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా మార్చి 7న తెలుగులో ఛావాను రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. తెలుగు మార్కెట్ కూడా తోడైతే ఛావా కలెక్షన్స్ ఊహాకందవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక బాక్సాఫీస్ గణాంకాలను పరిశీలిస్తే.. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లను రాబట్టింది ఛావా. 15వ రోజు వర్కింగ్ డే అయిన శుక్రవారం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ స్టడీగానే హోల్డ్ చేసింది ఛావా. ఇప్పటి వరకు రూ.560 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన విక్కీ కౌశల్ చిత్రం వీకెండ్‌లో మాత్రం కుమ్మిపడేసింది. శనివారం ప్రపంచవ్యాప్తంగా రూ.23 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి దుమ్మురేపింది. ఆదివారం కూడా ఛావా ఇదే జోరు కొనసాగిస్తుందని ట్రేడ్ పండితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి విక్కీ కౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











