Chhaava Day 20 Collections : క్లాస్‌గా కుమ్మేస్తోన్న ఛావా .. 20వ రోజు విక్కీ మూవీకి ఎన్ని కోట్లంటే?

సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్ధాపించి , హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాలన సాగించారు. చరిత్రలో మరుగున పడిన ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలతో తెరకెక్కిన సినిమాయే ఛావా. థియేటర్ల‌లో చూస్తున్న ప్రతి ఒక్కరూ పూనకాలతో ఊగిపోతున్నారు. విడుదలై 20 రోజులు కావొస్తున్నా ఇంకా ఈ సినిమా తుఫాన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా 20 రోజు ఛావా సినిమాకు ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయో పరిశీలిస్తే :

లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శంభాజీగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీత సారథ్యం వహించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఛావా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 20 Box Office Collections Worldwide

మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఛావాకు పాజిటివ్ మౌత్ టాక్ కూడా తోడై సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రిలీజైన నాటి నుంచి నేటి వరకు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లను రాబట్టిన ఛావా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.630 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రెండు వారాల వరకు ఎదురు లేకుండా సాగిన విక్కీ కౌశల్ చిత్రం.. థర్డ్ వీకెండ్‌లో బీభత్సం సృష్టించి ఆ తర్వాత వర్కిండ్ డేస్‌లో మాత్రం డల్ అయ్యింది.

మరో రోజులో ఛావా రిలీజై మూడు వారాలు ముగియనుంది. ఈ నేపథ్యంలో మూడు వారాల వరకు విక్కీ కౌశల్ చిత్రం ఎన్ని కోట్లు రాబడుతుందోనని విశ్లేషకులు రకరకాల లెక్కలు వేస్తున్నారు. ఇక శుక్రవారం నుంచి (మార్చి 7) విక్కీ కౌశల్ - రష్మిక మందన్నల ఛావా తెలుగులో విడుదల కానుంది. ఇప్పటి వరకు హిందీలో ఈ సినిమా ఉండటంతో బాధపడ్డ తెలుగు వారికి ఇకపై ఛావా తెలుగులో అందుబాటులోకి రానుండటంతో ఖుషీ అవుతున్నారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 20 Box Office Collections Worldwide

సోమ, మంగళ వారాల్లో రూ.11 కోట్లకు మించి వసూళ్లు రాలేదు. ఛావా విడుదలైన నాటి నుంచి ఇదే అతి తక్కువ కలెక్షన్. 20వ రోజైన బుధవారం వసూళ్ల విషయానికి వస్తే .. మార్నింగ్ షోలకు 7.10 శాతం, మ్యాట్నీ షోలకు 10.03 శాతం, ఫస్ట్ షోకు 11.43 శాతం, నైట్ షోకు 15.41 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో 1231 షోలు, ముంబైలో 1116 షోలు పడ్డాయి. మూడో వారంలో ఇప్పటి వరకు రూ. 82 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఛావా. 20వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 6 కోట్లు రాబట్టాడు విక్కీ కౌశల్. మరి లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X