Chhaava Day 22 Collections : దంచికొట్టిన విక్కీ కౌశల్.. తెలుగులో ఛావాకు రికార్డ్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్లంటే?

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో హిందీలో తెరకెక్కిన చిత్రం ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, రికార్డులను బద్ధలు కొడుతూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఛావా ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది? 22వ రోజు విక్కీ కౌశల్ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు అందుకుంది? ఈ వివరాలను పరిశీలిస్తే :

ఈ చారిత్రాత్మక కథలో ఛత్రపతి శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాకు నిర్మాణ బాధ్యతలు వహించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 22 Box Office Collections Worldwide

రిలీజైన నాటి నుంచి ఛావా చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. మరాఠాల శౌర్య, పరాక్రమాలు, ఛత్రపతి శంభాజీ మహరాజ్ త్యాగాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఒక్కసారిగా అంతా చరిత్ర పుస్తకాలను తిరగేస్తున్నారు. థియేటర్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కన్నీరు పెట్టడం .. దానికి సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీ తెలియకపోయినా దేశ ప్రజలు ఛావా సినిమాను ఆదరిస్తున్నారు.

ఈ సినిమాను దేశ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో సినిమాను తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఛావాను తెలుగులో విడుదల చేసింది. అయితే విడుదలకు ముందు కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడం దుమారం రేపాయి. చరిత్రను వక్రీకరించి ఛావాను తీశారని.. ఈ సినిమా వల్ల మత ఘర్షణలు చోటు చేసుకుంటాయని, ఛావా ప్రదర్శనను నిలిపివేయాలని వారు ప్రభుత్వానికి సూచించారు. అయినప్పటికీ ఛావా మార్చి 7న తెలుగులో విడుదలైంది.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 22 Box Office Collections Worldwide

ఉరి, సర్దార్ ఉదమ్, శ్యామ్ బహదూర్ చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు విక్కీ కౌశల్. దీనికి తోడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఉండటటం, ఛావా ఆల్రెడీ సంచలన విజయం అందుకున్న నేపథ్యంలో తెలుగులో ఈ సినిమాపై బజ్ నెలకొంది. దానికి తగ్గట్లుగానే తొలి రోజు తెలుగు ఛావా వసూళ్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 3 కోట్ల ఓపెనింగ్స్‌తో రేసు మొదలెట్టింది.

ఇక రిలీజైన నాటి నుంచి నేటి వరకు ఛావా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లను రాబట్టిన ఈ సినిమా మూడో వారంలో రూ. 87 కోట్లు రాబట్టింది. ఛావా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.630 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో 22వ రోజు వసూళ్లను పరిశీలిస్తే.. హిందీలో రూ.7 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్ల వసూళ్లను రాబట్టింది. శనివారం నుంచి వీకెండ్ మొదలుకానున్న నేపథ్యంలో ఈ రెండ్రోజుల్లో విక్కీ కౌశల్ చిత్రం కలెక్షన్లను కుమ్మేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X