Chhaava Day 23 Collections: ఛావా‌కు ప్లస్‌గా తెలుగు కలెక్షన్స్ .. విక్కీ కౌశల్ రేర్ ఫీట్, ఎన్ని కోట్లంటే?

ఛావాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నారు విక్కీ కౌశల్. ఆయన లీడ్ రోల్‌లో వచ్చిన ఈ చిత్రం సరికొత్త రికార్డులు తిరగరాస్తూ నేటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 20 రోజులు గడిచినా ఛావా సినిమాకు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే హిందీలో దుమ్మురేపుతోన్న ఈ సినిమాకు తెలుగు కలెక్షన్స్ కూడా తోడు కావడంతో ఛావా వడివడిగా రూ.1000 కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. మరి 23వ రోజు విక్కీ కౌశల్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఛావాలో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 23 Box Office Collections Worldwide

రిలీజైన నాటి నుంచి ఛావా చిత్రం రికార్డు కలెక్షన్స్‌ని తన ఖాతాలో వేసుకుంటోంది. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లను రాబట్టిన ఈ సినిమా మూడో వారంలో రూ. 87 కోట్లు రాబట్టింది. ఛావా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరినట్లుగా ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. హిస్టారిక్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఛావాకు దేశవ్యాప్తంగా దక్కుతున్న ఆదరణ దృష్ట్యా ఈ సినిమాను దాదాపు మూడు వారాల తర్వాత తెలుగులో అనువదించి వదిలారు. మహిళా దినోత్సవం కానుకగా మార్చి 7న విడుదల చేశారు. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ తెలుగులోనూ ఛావాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజు రూ. 3 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి విక్కీ కౌశల్‌కు మంచి ఫ్యాన్ బేస్ తీసుకొచ్చింది. అంతేకాదు.. ఓ డబ్బింగ్ చిత్రానికి తెలుగునాట ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం అరుదైన విషయమని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

తొలిరోజుతో పోలిస్తే రెండో రోజైన శనివారం తెలుగులో ఛావా కలెక్ష్సన్స్ మరింత పెరిగాయి. ఏకంగా రూ. 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్మురేపాడు విక్కీ కౌశల్. ఛావా స్పీడు చూస్తుంటే తొలివారంలోనే రూ.10 కోట్ల మార్క్‌ను అవలీలగా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ షో,సెకండ్ షోలకు జనం నుంచి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ సహా పలు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సీజన్‌లోనూ ఇలాంటి వసూళ్లు రావడం మామూలు విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా 23వ రోజు ఛావా కలెక్షన్స్‌ విషయానికి వస్తే .. వీకెండ్‌లో కుమ్మేస్తోన్న విక్కీ కౌశల్ ఆ సెంటిమెంట్‌ను ఈ వీకెండ్‌లోనూ కొనసాగించాడు. శుక్రవారం రూ.9 కోట్లు రాబట్టిన ఛావా శనివారం రూ.18 కోట్లు రాబట్టింది. ఇందులో హిందీ నుంచి రూ.14.5 కోట్లు, తెలుగు నుంచి రూ.3.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆదివారం కూడా కలెక్షన్స్ అదిరిపోతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి చూద్దాం విక్కీ కౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X