Chhaava Day 25 Collections: వర్కింగ్ డేలోనూ వసూళ్ల మోత.. విక్కీ కౌశల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మరాఠా సామ్రాజ్యంపై మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దండయాత్రలు, శత్రువుల బారి నుంచి రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఛత్రపతి శంభాజీ మహారాజ్ చేసిన యుద్ధాలే ఇతివృత్తంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాయే ఛావా. ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాల్లో సంచలన విజయం అందించడంతో పాటు ప్రేక్షకుల ఆదరణను పొందిన సినిమాగా ఛావా నిలిచింది. విడుదలైన 25వ రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో చూస్తే :

ఛావాలో శంభాజీగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 25 Box Office Collections Worldwide

ఈ సినిమా రిలీజైన నాటి నుంచి థియేటర్లన్నీ జై జగదాంబే, జై శివాజీ, జై శంభాజీ అనే నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రేక్షకుల భావోద్వేగాలు, సినిమా చూసి విలపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఛావా. తద్వారా రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిన 9వ బాలీవుడ్ సినిమాగా ఈ సినిమా నిలిచింది.

ఇప్పటి వరకు హిందీలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఛావాకు ఇప్పుడు తెలుగు మార్కెట్ నుంచి కూడా మాస్ కలెక్షన్స్ వస్తున్నాయి. మార్చి 7న తెలుగులో విడుదలైన ఛావా ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీలో రిలీజై ఇప్పటికే కథ, కథనం, దృశ్యాలు బయటికి వచ్చిన తర్వాత కూడా తెలుగు ప్రేక్షకులు ఛావాను ఆదరిస్తున్నారు. తొలి వీకెండ్‌లో మూడు రోజులు కలిపి దాదాపు రూ.11 కోట్లు రాబట్టిన విక్కీ కౌశల్.. తెలుగులో నాలుగవ రోజు వర్కింగ్ డే కావడంతో కాస్త డల్ అయ్యింది. సోమవారం తెలుగులో రూ. కోటి గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 25 Box Office Collections Worldwide

ఇక ప్రపంచవ్యాప్తంగా 25వ రోజు ఛావా కలెక్షన్స్‌ విషయానికి వస్తే .. వీకెండ్‌లో విక్కీ కౌశల్ కుమ్మిపారేశాడు. శుక్రవారం రూ.10 కోట్లు, శనివారం రూ.18 కోట్లు, ఆదివారం రూ. 12 కోట్ల కలెక్షన్స్‌తో ఈ మూడు రోజుల్లోనే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఛావా. అయితే సోమవారం వర్కింగ్ డే కావడంతో కాస్త స్లో అయినప్పటికి సాలీడ్ కలెక్షన్స్ అందుకున్నాడు విక్కీ కౌశల్. ప్రపంచవ్యాప్తంగా సోమవారం రూ. 7.5 కోట్ల గ్రాస్ అందుకుంది ఛావా. మరి నాలుగో వారం ముగిసేసరికి విక్కీ కౌశల్ చిత్రం ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X