Chhaava Day 26 Collections: విక్కీ కౌశల్ మేనియా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర, 26వ రోజు ఎన్ని కోట్లంటే?

గత కొద్దిరోజులుగా ప్రేక్షకులు, సినీ , రాజకీయ వర్గాలు, మేధావుల మధ్య డిస్కషన్‌కు కారణమైన చిత్రం ఛావా. 400 ఏళ్ల క్రితం మరాఠా రాజ్యాన్ని ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రి హిట్‌గా నిలిచింది. కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు ఎదురైనా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 26వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే .

చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీత సారథ్యం వహించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 26 Box Office Collections Worldwide

పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్‌తో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. మరో రెండ్రోజుల్లో నాలుగో వారాన్ని కూడా పూర్తి చేసుకుంటుండగా.. కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఛావా తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు రాబట్టింది. 26 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఛావా. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది ఛావా.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్‌ల ఎపిక్ మూవీ బాహుబలి 2 నెలకొల్పిన కలెక్షన్ల రికార్డుని విక్కీ కౌశల్ చిత్రం బద్ధలు కొట్టింది. హిందీలో బాహుబలి 2 లాంగ్ రన్‌లో రూ.510 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. ఇప్పుడు ఈ రికార్డును ఛావా క్రాస్ చేసింది. కేవలం 25 రోజుల్లోనే రూ.516 కోట్ల వసూళ్లను సాధించి దుమ్మురేపాడు విక్కీ కౌశల్. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైమ్ టాప్ హిందీ చిత్రాల్లో ఛావా 6వ స్థానంలో నిలిచింది.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 26 Box Office Collections Worldwide

హిందీలో బంపర్ విక్టరీ కొట్టిన ఛావా చిత్రాన్ని ప్రేక్షకుల కోరిక మేరకు మార్చి 7న గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.12 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా అప్పుడే లాభాల్లోకి వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌తో పాటు పలు పరీక్షలు జరుగుతుండగా ఇలాంటి సీజన్‌లోనూ రూ.కోటికి తగ్గకుండా వసూళ్లను అందుకుంటోంది ఛావా. 5వరోజు తెలుగులో మరోసారి కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దుమ్మురేపింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా 26వ రోజు ఛావా కలెక్షన్స్‌ విషయానికి వస్తే .. మంగళవారం ఫస్ట్ షో, సెకండ్ షోలకు సాలీడ్ బుకింగ్స్ జరిగాయి. ఢిల్లీలో 1209 షోలు, ముంబైలో 1074 షోలు, పూణేలో 557 షోలు, అహ్మదాబాద్‌లో 596 షోలు పడ్డాయి. 26వ రోజు ప్రపంచవ్యాప్తంగా హిందీలో రూ.6.25 కోట్లు, తెలుగులో రూ. కోటి చొప్పున మొత్తంగా రూ.8 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఛావా. మరి ఈ సినిమా లాంగ్‌ రన్‌లో ఏ రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X