Chhaava Day 27 Collections: ఛావా వసూళ్ల బీభత్సం .. విక్కీ కౌశల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఛావాతో తన నట జీవితంలోనే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్. దాదాపు రూ.740 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో వడివడిగా రూ.1000 కోట్ల దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్‌ల బాహుబలి 2 రికార్డులను ఈ సినిమా బద్ధలుకొట్టి.. మరిన్ని విజయాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో 27వ రోజు ఛావా ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే

ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. శంభాజీ పాత్రను ఆయన తప్ప మరొకరు వేయలేరు అన్నట్లుగా జీవించారు విక్కీ. ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఆయన ఎక్కడికి వెళ్లినా జనం శంభాజీ .. శంభాజీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రతి నటుడికి జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం వస్తుందని ఆ అదృష్టం విక్కీ కౌశల్‌కు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 27 Box Office Collections Worldwide

ఇక రష్మిక మందన్న గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయారు. మూడేళ్లలో ఆమె నటించిన మూడో చిత్రం ఇండస్ట్రి హిట్‌గా నిలిచింది. యానిమల్ రూ.920 కోట్లు, పుష్ప 2 రూ.1871 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు ఛావాతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రేపో మాపో రూ.1000 కోట్ల మార్క్‌ను క్రాస్ చేస్తుందని విశ్లేషకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఛావాలో శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా అద్భుతంగా నటించారు రష్మిక.

ఛావాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు రాబట్టింది.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 27 Box Office Collections Worldwide

తెలుగులో మార్చి 7న ఛావా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందని లభిస్తోంది. రోజుకు రూ.కోటికి తగ్గకుండా వసూళ్లను అందుకుంటోంది. తాజాగా తెలుగులో 6వ రోజు కోటి రూపాయలకు పైగా కలెక్ట్ చేసి దుమ్మురేపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 27వ రోజు వసూళ్ల విషయానికి వస్తే .. బుధవారం ఫస్టో షోలకు 11.43 శాతం, సెకండ్ షోలకు 15.41 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. వర్కింగ్ డే అయినప్పటికీ 27వ రోజు రూ.6.5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది ఛావా. శుక్రవారం హోలీ పండుగ, తర్వాత వీకెండ్ కావడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X