Chhaava Day 29 Collections: పుష్ప 2, స్త్రీ 2 ఔట్.. ఛావా వసూళ్ల ఊచకోత, విక్కీ కౌశల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
రోటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు, బయోపిక్స్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. నలుగురికి ప్రత్యేకంగా కనిపించే ఆ నిర్ణయాలే ఆయనను స్టార్‌గా నిలబెట్టాయి. ఈ క్రమంలో మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో విక్కీ కౌశల్ నటించిన చిత్రమే ఛావా. విడుదలై నెల రోజులు కావొస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో 29వ రోజు ఛావా సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మన్ సంగీతం సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

తొలి వారంలో ఛావా రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్.. నాలుగో వారంలో రూ.60 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్న ఛావా.. అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల సరసన నిలిచింది. అలాగే హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రాజమౌళి - ప్రభాస్‌ల బాహుబలి 2 రికార్డులను బద్ధలు కొట్టింది.
మార్చి 7న ఛావాను తెలుగులో రిలీజ్ చేయడం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. దాదాపు 9 రోజులుగా రోజుకు రూ. కోటి తగ్గకుండా వసూళ్లు సాధించిన ఛావా ఇక్కడ అప్పుడే లాభాల్లోకి వచ్చేసింది. ఇక 29వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే శుక్రవారం హోలీ పర్వదినం కావడంతో ఛావాకు మంచి ఆక్యూపెన్సీ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా అయిపోవడం ఛావాకు కలిసొచ్చింది. 29వ రోజు హిందీలో రూ.7 కోట్లు, తెలుగులో కోటి రూపాయల చోప్పున రూ.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

జాన్ అబ్రహం నటించిన డిప్లొమాట్.. తెలుగులో దిల్‌రూబా, కోర్ట్ వంటి సినిమాలు రిలీజైనప్పటికీ వాటన్నింటినీ తట్టుకుని నిలబడింది ఛావా. 29వ రోజు వసూళ్లతో ఛావా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా పుష్ప 2 , స్త్రీ 2, భూల్ భూలయ్యా రికార్డులను బద్ధలు కొట్టింది. 29వ రోజు పుష్ప 2 రూ.3.75 కోట్లు.. స్త్రీ2 రూ.2.75 కోట్లు, భూల్ భూలయ్యా రూ.2.4 కోట్లు కలెక్షన్స్‌ను అందుకోగా.. ఛావా హిందీలో ఏకంగా రూ.5.15 కోట్లు రాబట్టి రేర్ రికార్డు కొట్టింది. విక్కీ కౌశల్ జోరు చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా దూకుడు తగ్గేలా కనిపించడం లేదు. మరి రానున్న రోజుల్లో ఛావా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











