Chhaava Day 32 Collections: ఛావాకు టఫ్ ఫైట్‌ .. దారుణంగా పడిపోయిన వసూళ్లు, ఎన్ని కోట్లంటే?

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన ఛావా .. బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తూనే ఉంది. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఛావా.. చారిత్రాత్మక సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్‌లు క్రియేట్ చేసింది. హిందీలో ఒక ఊపుతున్న దశలో మూడు వారాలు ఆలస్యంగా తెలుగులోకి వచ్చిన ఛావాకు తెలుగు జనాలు నీరాజనాలు పడుతున్నారు. దాదాపు రూ.750 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాల లిస్ట్‌లో దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో 32వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా.. అకాడమీ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహ్మన్ స్వరాలు అందించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవల్‌లో విడుదల చేశారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 32 Box Office Collections Worldwide

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు శంభాజీగా విక్కీ కౌశల్ పవర్‌ఫుల్ యాక్టింగ్, దేశభక్తి, త్యాగం, జాతీయవాదం, సంగీతం ఇలా అన్ని అంశాలు కలగలిసి ఛావాను థియేటర్‌లలో చూస్తూ ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. సినిమా చూసి బయటికి వస్తూ చిన్నా పెద్దా కన్నీటి పర్యంతం అవుతున్నారు. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ ఇలా అన్ని అంశాలు కలిసొచ్చి సినిమా దూసుకెళ్తోంది.

తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు.. నాలుగో వారంలో రూ.60 కోట్లను అందుకున్న ఛావా ఐదో వారాన్ని ఎలా ముగిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కొత్తగా మార్కెట్‌లోకి ఎలాంటి పెద్ద సినిమాలు రాకపోవడంతో ఛావా మరికొంతకాలం తన హవా సాగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ.1000 కోట్ల మార్క్‌ని ఛావా ఖచ్చితంగా అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఇక 32వ రోజు ఛావా వసూళ్ల విషయానికి వస్తే .. సోమవారం వర్కింగ్ డేస్ కావడంతో పాటు పరీక్షల సీజన్ కావడంతో బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. 32వ రోజు మార్నింగ్ షోల నుంచే బుకింగ్స్ మందకోడిగా సాగాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు పుంజుకుంటుందని అనుకున్నా.. సాయంత్రం ఆటకు 10.37 శాతం, నైట్ షోలకు 11.47 శాతం ఆక్యూపెన్సీ మాత్రమే నమోదైంది.

Take a Poll

దీంతో ఛావా విడుదలైన నాటి నుంచి నేటి వరకు ఎన్నడూ లేని విధంగా అత్యంత స్వల్పంగా వసూళ్లు నమోదయ్యాయి. సోమవారం ప్రపంచవ్యాప్తంగా రూ.3.16 కోట్లను ఛావా కలెక్ట్ చేసింది. ఇందులో హిందీ నుంచి రూ. 2.54 కోట్లు, తెలుగులో రూ.42 లక్షల వసూళ్లు వచ్చాయి. మరి ఇన్ని సవాళ్ల మధ్య ఐదో వారం విక్కీ కౌశల్ చిత్రం ఎంత మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X