Chhaava Day 34 Collections: ఛావాకు గట్టి దెబ్బ.. పనిచేయని విక్కీ మేజిక్, రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?
థియేటర్లలో విడుదలై నెల రోజులు కావొస్తున్నా, అన్ సీజన్ అయినా బాక్సాఫీస్ వద్ద ఛావా పరుగులు ఏమాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ టాప్ బుకింగ్స్‌తో దుమ్మురేపుతున్నాడు. వర్కింగ్ డేస్‌లో నెట్టుకొస్తున్న విక్కీ కౌశల్.. వీకెండ్ వస్తే మాత్రం రిలీజ్ డే మాదిరిగా రెచ్చిపోతున్నాడు. అతని దూకుడు ముందు రికార్డులు బద్ధలైపోతున్నాయి. ఇప్పటికే రూ.750 కోట్లకు పైగా వసూళ్లతో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న విక్కీ కౌశల్.. కెరీర్‌లో తొలిసారిగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాలని తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో 34వ రోజు ఛావా ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించిందో చూస్తే :
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు తమ నటనతో ఒదిగిపోయారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

తొలుత హిందీలో మాత్రమే విడుదలైన ఛావాను ప్రాంతాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఛావాను ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తొలుత మార్చి 7న తెలుగులో ఛావాను విడుదల చేయగా ఊహకందని వసూళ్లతో లాభాల పంట పండిస్తోంది. తెలుగులో రిలీజ్ చేయడం ఛావాకు అదనపు బలంగా మారిందని ట్రేడ్ పండితులు విశ్లేషించారు.
ఛావా తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు.. నాలుగో వారంలో రూ.60 కోట్లను అందుకుంది. ఇక 34వ రోజు వసూళ్ల విషయానికి వస్తే హిందీలో రూ.2.15 కోట్లు, తెలుగులో రూ.35 లక్షల చొప్పున మొత్తంగా రూ.2.62 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా 34 రోజులు ముగిసేసరికి ఇండియాలో రూ.677 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.90.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో రూ.767.25 కోట్ల వసూళ్లను సాధించింది. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడం ఛావాకు బాగా కలిసొస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షల సీజన్ నడుస్తుండటంతో ఛావాపై ఎఫెక్ట్ చూపిస్తోంది. మరో 10 రోజులు ఊపిక పడితే ఈ సినిమాకు ప్లస్‌గా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందరి చూపు రాబోయే వీకెండ్ మీదే ఉంది. ఇప్పటి వరకు వారాంతాల్లో ఈ సినిమా నిరాశపరచకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ టఫ్ కండీషన్ నుంచి ఛావాను ఈ వీకెండ్ బయటపడేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి విక్కీ కౌశల్ ఎంత వరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











