Chhaava Day 35 Collections: వసూళ్లలో విక్కీ కౌశల్ రేర్ ఫీట్ .. 5వ వారం ఛావాకు ఎన్ని కోట్లంటే?

ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా నటించి తన కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్. అదే ఛావా. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదలైన ఈ చారిత్రాత్మక చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు రూ.770 కోట్ల వసూళ్లు చేసిన ఛావా.. రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. విక్కీ కౌశల్ అభిమానులు మాత్రం తమ హీరో ఎట్టి పరిస్థితుల్లోనూ వెయ్యి కోట్లు కొట్టేస్తాడని ధీమాగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 35వ రోజు ఛావా ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు లీడ్ రోల్స్ పోషించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు.

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 35 Box Office Collections Worldwide

దాదాపు రూ. 750 కోట్లకు పైగా వసూళ్లతో 2025లో విడుదలైన భారతీయ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఛావా నిలిచింది. దీని తర్వాత వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, అక్షయ్ కుమార్ స్కైఫోర్స్, నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజ్, ప్రదీప్ రంగరాజన్ డ్రాగన్ చిత్రాలు ఉన్నాయి. ఇక విక్కీ కౌశల్ కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఉన్న ఉరి (రూ.244 కోట్లు)ని ఛావా అధిగమించింది.

తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు.. నాలుగో వారంలో రూ.60 కోట్లను అందుకుంది. మార్చి 20వ తేదీతో ఛావా విడుదలై 35 రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఐదో వారం ముగిసేసరికి విక్కీ కౌశల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్లు రాబట్టింది. హిందీలో రూ.31.5 కోట్లు , తెలుగులో రూ.3.5 కోట్ల చొప్పున కలెక్షన్స్‌ను అందుకుంది. 35వ రోజు రూ.2.50 కోట్లు రాబట్టింది.. ఇందులో హిందీ నుంచి రూ.2.20 కోట్లు, తెలుగులో రూ.30 లక్షలు అందుకుంది. మొత్తంగా 35 రోజుల వరకు ఛావా హిందీలో రూ.558 కోట్లు, తెలుగులో రూ.16 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.94 కోట్ల చొప్పున కలెక్షన్స్ అందుకుంది. అలా మొత్తంగా ఇప్పటి వరకు రూ.770 కోట్ల గ్రాస్ రాబట్టాడు విక్కీ కౌశల్.

ఐదో వారంలో సోమవారం నుంచి గురువారం వరకు కలెక్షన్స్ విషయంలో నిరాశ పరిచిన ఛావా.. వీకెండ్‌లో తన సత్తా చాటుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి వారాంతాల్లో దుమ్మురేపడమే దీనికి కారణం. ఛావా ఈ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టడంతో వీకెండ్ కలెక్షన్సే ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో ఈ వారాంతంలోనూ విక్కీ కౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X