Chhaava Day 41 Collection: ఆగని విక్కీ జైత్రయాత్ర.. పుష్ప 2, జవాన్ రికార్డులు ఔట్ .. ఛావాకు ఎన్ని కోట్లంటే?
దాదాపు నెలన్నర నుంచి ఇండియా వ్యాప్తంగా ఛావా .. ఛావా .. ఛావా అనే పేరు వినిపిస్తోంది. థియేటర్‌లో చిన్నారులు, పెద్దల కన్నీళ్లు.. భారతీయ సనాతన ధర్మం, మత మార్పిడులు, రాజుల త్యాగాలపై చర్చకు కారణమైంది ఛావా. ఈ మధ్యకాలంలో సమాజంలో ఈ స్థాయిలో చర్చనీయాంశమైన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. విడుదలైన నాటి నుంచి నేటి వరకు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోన్న ఛావా.. 41వ రోజు ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే:
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు ఒదిగిపోయారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు.

టీజర్, ట్రైలర్లు, విక్కీ కౌశల్ పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఛావాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు.. నాలుగో వారంలో రూ.60 కోట్లు.. ఐదో వారంలో రూ.35 కోట్లు రాబట్టింది ఛావా. వర్కింగ్ డేస్‌లో స్లో అయినా వీకెండ్ వచ్చేసరికి జూలు విదుల్చుతున్నాడు విక్కీ కౌశల్. ఆరో వారంతంలో రూ.10.5 కోట్లు వసూలు చేసింది ఛావా. తద్వారా శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 ఆరో వారంతంలో అందుకున్న రూ.14.32 కోట్ల రికార్డును ఛావా దాటలేకపోయింది. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 (హిందీ) వసూళ్లను అధిగమించి.. హిందీ సినిమా చరిత్రలో ఆరవ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
వీకెండ్ ముగిసిన నాటి నుంచి ఛావా బుకింగ్స్ బాగా డ్రాప్ అయ్యాయి. సోమవారం రూ.1.80 కోట్లు, మంగళవారం రూ.1.60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టాడు విక్కీ కౌశల్. 40 రోజుల వరకు రూ.584.52 కోట్ల వసూళ్లతో ఛావా (హిందీ) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (హిందీ) సాధించిన వసూళ్లను రూ.584 కోట్లను ఛావా అధిగమించింది. తద్వారా అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ చిత్రాల్లో ఛావా మూడో స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో రూ.836.09 కోట్ల కలెక్షన్స్‌తో పుష్ప 2 అగ్రస్థానంలో ఉండగా.. రూ.627.50 కోట్లతో స్త్రీ 2 రెండో స్థానంలో నిలిచింది.
ఇక 41వ రోజు ఛావా వసూళ్ల విషయానికి వస్తే.. బుధవారం మార్నింగ్ నుంచి సెంకడ్ షో వరకు ఏ ఆటకు కూడా ఆక్యూపెన్సీ సింగిల్ డిజిట్ దాటలేదు. మార్నింగ్ షోలకు 6.09 శాతం, మ్యాట్నీకి 8.93 శాతం, ఫస్ట్ షోకు 9.78 శాతం, సెకండ్ షోలకు 9.59 శాతం మాత్రమే ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్.కామ్ వెల్లడించింది. ఈ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా ఛావా రూ.1.40 కోట్ల గ్రాస్ రాబట్టగా , ఆఫ్‌లైన్ లెక్కలతో కలుపుకుంటే రూ.1.50 కోట్లపైనే వసూళ్లు అందుకుంది. మొత్తంగా 41 రోజుల వరకు ఇండియా వైడ్‌గా రూ.698.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.91 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.789.65 కోట్ల గ్రాస్ రాబట్టింది ఛావా. ఈ వారం క్రేజీ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఛావా ఈ పోటీని ఎలా తట్టుకుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











