Chhaava Day 43 Collection: దెబ్బేసిన కొత్త సినిమాలు.. పడిపోయిన ఛావా వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీకౌశల్ నటించిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ దుమ్మురేపుతోంది. ఆరు వారాల రన్నింగ్ రేసు పూర్తి చేసుకున్న ఈ సినిమా 50 రోజుల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా, అన్ సీజన్ అయినా ఛావా కలెక్షన్ల వర్షం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో 43వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఎన్ని కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుందో చూస్తే :
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు అద్భుతంగా నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించగా.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలైన క్షణం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు.. నాలుగో వారంలో రూ.60 కోట్లు.. ఐదో వారంలో రూ.35 కోట్లు, ఆరవ వారంలో రూ.16.3 కోట్లు రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. మార్చి 7 నుంచి తెలుగులో విడుదలైన ఛావా ఇక్కడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
తెలుగు డబ్బ్ అయిన హిందీ చిత్రాలలో ఛావా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇప్పటి వరకు రూ.15.1 కోట్లను అందుకున్న విక్కీ కౌశల్ చిత్రం.. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా నిలిచింది. రణబీర్ కపూర్ నటించిన యానిమల్ రూ.46 కోట్లతో ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. జవాన్ రూ.28 కోట్లు, బ్రహ్మాస్త్ర రూ.15.27 కోట్లుతో ఛావా కంటే ముందున్నాయి. ఆ తర్వాత పఠాన్ రూ.13 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
41 రోజు నాటి వసూళ్లతో హిందీ వసూళ్లపరంగా రూ.600 కోట్ల కలెక్షన్స్ సాధించింది ఛావా. తద్వారా రూ.600 కోట్ల వసూళ్లు అందుకున్న 8వ భారతీయ చిత్రంగా నిలిచింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ 2, జవాన్, కల్కి 2898 ఏడీ, స్త్రీ 2, పుష్ప 2లు ముందున్నాయి. ఇక 43వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఛావా రూ. 1.09 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్‌లైన్ లెక్కలతో కలుపుకుని ఇది రూ. 1.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. తద్వారా ఇప్పటి వరకు రూ.793 కోట్ల గ్రాస్‌ను విక్కీ కౌశల్ సినిమా అందుకుంది. ఇందులో భారత్ నుంచి రూ. 702 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ.91 కోట్ల వసూళ్లు వచ్చాయి.
వీకెండ్‌లో తొలి నుంచి దుమ్మురేపుతోన్న ఛావా ఈసారి కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని ట్రేడ్ పండితులు ఆశిస్తున్నారు. ఉగాది, రంజాన్ పర్వదినాలు కూడా కలిసిరావడంతో మంచి హోల్డ్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి విక్కీ కౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











