Chhaava Day 45 Collection : దెబ్బకొట్టిన సికందర్.. దారుణంగా ఛావా వసూళ్లు, విక్కీ కౌశల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

విడుదలైన రోజు నుంచి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న ఛారిత్రక చిత్రం ఛావా. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు , ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సమాజంపై పెను ప్రభావం చూపింది. సోషల్ మీడియాలోనూ, బయట ఇలా ఎక్కడ చూసినా ప్రజలు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇంతటి ఎఫెక్ట్ చూపించిన చిత్రం ఛావా తప్పించి మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

పాజిటివ్ టాక్‌, థియేటర్లలో చిన్నా పెద్ద కన్నీళ్లు, సోషల్ మీడియాలో చర్చ .. వీటన్నింటి కారణంగా బాక్సాఫీస్ వద్ద ఛావా రికార్డు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఒక్కొక్క చిత్రం రికార్డును అధిగమిస్తూ దూసుకెళ్లిన ఈ చిత్రం వీకెండ్స్‌లో మాత్రం ఊచకోత కోస్తోంది. మరి 7వ వారాంతంలో ఛావా ఎలాంటి ప్రభావం చూపింది? కొత్త చిత్రాలను ఎదుర్కొని విక్కీ కౌశల్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు రాబట్టాడో చూస్తే :

Vicky Kaushal Rashmika Mandanna s Chhaava Day 45 Box Office Collections Worldwide

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించగా.. వాలంటైన్స్ డే కానుకగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలైన క్షణం నుంచి ప్రభంజనం సృష్టించిన ఛావా తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు.. నాలుగో వారంలో రూ.60 కోట్లు.. ఐదో వారంలో రూ.35 కోట్లు, ఆరవ వారంలో రూ.16.3 కోట్లు రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో 7 వారాల ఫీట్‌ను ఛావా కంప్లీట్ చేసుకోనుంది. అప్పటికి ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబడుతుంది? 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

44 రోజుల వరకు ఛావా హిందీ వెర్షన్‌లో 591 కోట్లు, తెలుగులో రూ.16 కోట్లు చొప్పున ఇండియా వైడ్‌ నికరంగా రూ.607 కోట్లు రాబట్టింది ఛావా. దీంతో శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సాధించిన రూ.627.50 కోట్ల కలెక్షన్ల రికార్డును బద్ధలు కొడుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక 45వ రోజు నాటి ఛావా వసూళ్లను పరిశీలిస్తే ఆదివారం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ రిలీజ్ కావడంతో ఈ సినిమా దెబ్బతో మెజారిటీ థియేటర్లను విక్కీ కౌశల్ చిత్రం కోల్పోయింది.

ఛావా ఆదివారం ఓవరాల్‌గా 35.38 శాతం ఆక్యూపెన్సీ అందుకోగా.. ముంబైలో 84, ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో 111 , పూణేలో 83 షోలు పడ్డాయి. ఇప్పటి వరకు ప్రతి వీకెండ్‌లో హోల్డ్ చూపించిన ఛావా.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. 45వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.1.15 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆఫ్‌లైన్ టికెట్ సేల్స్‌తో కలిపితే ఇది రూ.1.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొత్త సినిమాల ప్రభావం నేపథ్యంలో ఛావాకు గట్టి పోటీ ఎదురవుతూ ఉండటంతో రాబోయే రోజుల్లో విక్కీకౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X