10 రోజుల్లోనే కుమ్మేసింది... 100 కోట్ల కాసుల వర్షం.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!
భారత, పాకిస్థాన్ సరిహద్దులో జరిగిన దాడుల కథా నేపథ్యంతో భావోద్వేగంగా తెరకెక్కిన యూరీ: సర్జికల్ స్ట్రైయిక్స్ చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. 2016 సెప్టెంబర్ 29న పాకిస్థాన్‌పై భారత్ చేసిన మెరుపుదాడుల కథతో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఈ చిత్రం కేవలం పదిరోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. యూరీ చిత్రం సృష్టిస్తున్న వసూళ్ల జైత్రయాత్ర గురించి మరిన్ని విషయాలు..

రూ.28 కోట్లతో యూరీ
యూరీ: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రం కేవలం రూ.28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రంలో సంజూ ఫేమ్ విక్కీ కుశాల్, యామీ గౌతమ్, పరేష్ రావెల్ కీలక పాత్రలో నటించారు. జనవరి 21న రిలీజైన ఈ చిత్రం తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లు సాధించింది.

2019 సంవత్సరంలో సెన్సేషనల్ హిట్
యూరీ చిత్రం తొలివారం ముగిసే సమయానికి రూ.60 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మౌత్ టాక్ పెరగడంతో కలెక్షన్లు భారీగా వృద్ధి చెందాయి. భారీ చిత్రాలకు ధీటుగా ఈ సినిమా వసూళ్లను సాధిస్తూ 2019లో సెన్సేషనల్ హిట్‌గా నమోదు చేసుకొన్నది. ఈ వారం రిలీజైన చీట్ ఇండియా, రంగీలా రాజా, ఫ్రాడ్ సైయాన్ చిత్రాలకు ధీటుగా వసూలు చేస్తున్నది.

10 రోజుల్లో రూ.100 కోట్లు
యూరీ చిత్రం సాధిస్తున్న సంచలన వసూళ్ల గురించి ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్ష్ స్పందించారు. రిలీజైన 5వ రోజుకు రూ.50 కోట్లు, 8వ రోజున రూ.75 కోట్లు సాధించింది. 10వ రోజు ముగిసేటప్పటికే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది అని తరుణ్ పేర్కొన్నారు.

ఈ ఏడాదిలో బ్లాక్‌బస్టర్ ఇదే
2019 ఏడాదిలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రమే కాకుండా ఇప్పటి వరకు ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమాగా యూరి: ది సర్జికల్ స్ట్రైక్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది అని తరుణ్ ఆదర్ష్ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. పూర్తిస్థాయి ఎమోషనల్ కంటెంట్‌తో, దేశభక్తి, ఇతర అంశాలను మేలవించిన ఈ చిత్రానికి ఆదిత్య ధార్ దర్శకుడు.


Click it and Unblock the Notifications











