చిన్న చిత్రం భారీ విజయం.. ఐదు రోజుల్లోనే షాకింగ్ వసూళ్లు.. 100 కోట్లపై..
బాలీవుడ్‌లో చిన్న చిత్రంగా రిలీజై యూరీ: ది జర్జికల్ స్ట్రైక్స్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. భారత, పాక్ సరిహద్దుల్లో యుద్ధ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలందుకొన్నది. దేశభక్తి, భావోద్వేగ కథతో రూపొందిన ఈ చిత్రంలో సంజూ ఫేం వికీ కుషాల్, పరేష్ రావల్, యామీ గౌతమీ తదితరులు నటించారు. రూ.50 కోట్ల క్లబ్‌లో చేరేందుకు ఈ చిత్రం పరుగులు పెడుతున్నది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే. .

ఐదు రోజుల కలెక్షన్లు ఇవే
ఐదు రోజుల కలెక్షన్లు ఇవే
జనవరి 11న రిలీజైన ఈ చిత్రం తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ.8.20 కోట్లు వసూలు చేసింది. రెండో రోజున 51 శాతం వృద్ధితో రూ.12.43 కోట్లు వసూలు చేసింది. మూడో రోజున రూ.15.10 కోట్లు, సోమవారం రూ.10.51 కోట్లు, మంగళవారం రూ.9.57 కోట్లతో రూ.50 కోట్లు వసూలు చేసింది. తొలి ఐదు రోజుల్లో రూ.55 కోట్లకుపైగా వసూలు చేసింది.

2019లో తొలి హిట్
బాలీవుడ్‌లో 2019 సంవత్సరంలో తొలి హిట్ యూరీ సర్జికల్ స్ట్రైక్స్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల హంగామా చేస్తున్నది. మూడు రోజుల్లోనే రూ.35.73 కోట్లు వసూలు చేసింది. మౌత్ పబ్లిసిటీ పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో భారీ వసూళ్లను నమోదు చేయడం కావడం గ్యారెంటీ అనే విషయం స్పష్టమవుతున్నది.

యూరీ మూవీ కథ ఇదే
2016 సెప్టెంబర్ 29న భారతీయ నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం ఏడు ప్రదేశాల్లో చేపట్టిన మెరుపు దాడుల నేపథ్యంగా యూరీ: సర్జికల్ స్ట్రైక్స్ చిత్రం రూపొందింది. పాక్‌పై భారత సైన్య దాడులతో ఆర్మీ తన సత్తాను చాటింది. తెర మీద ఈ కథ భావోద్వేగాన్ని పండించే విధంగా ఉందనే మాట ప్రేక్షకుల నుంచి వస్తున్నది.

షాక్‌లో హీరో వికీ కౌశల్
యూరీ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడంపై హీరో వికీ కుశాల్ స్పందించాడు. రిలీజ్ తర్వాత కూడా మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం ఉండేది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా సంతోషం కలుగుతుంది. మంచి హృదయంతో ఈ సినిమాను అక్కున చేర్చుకోవడం గొప్పగా అనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











