The Great Indian Family Collections షాకింగ్‌గా వికీ కౌశల్ మూవీ కలెక్షన్లు..ఎన్ని కోట్ల వసూళ్లంటే?
బాలీవుడ్ తారలు వికీ కౌశల్, మనుషీ చిల్లర్ జంటగా థంగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఫేమ్ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య రూపొందించిన చిత్రం ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ. ఉత్తరాదిలోని ఓ ప్రాంతంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కామెడీకి పెద్ద పీట వేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు, బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ కథ ఏమిటంటే?: ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమా విషయానికి వస్తే.. ఉత్తరాదిలో భజన్ కుమార్ అలియాస్ బిల్లూ అనే పండితుడి ఫ్యామిలీ గురించిన కథ. ఆ ప్రాంతంలో పూజారిగా, వ్యాపారవేత్తగా బిల్లూ తండ్రి (కుముద్ షా)కు మంచి పేరుటంటుంది. అయితే సంప్రదాయాలు, కట్టుబాట్లతో ఉండే ఫ్యామిలీ జరిగే సంఘటనలను థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ఫేమ్, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు ప్రస్తుతం యావరేజ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్ర మొదలైంది.

బడ్జెట్, బ్రేక్ ఈవెన్: ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే. ఈ సినిమాను సుమారుగా 55 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ప్రమోషన్స్, ఇతర ఖర్చులతో 60 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 65 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద వసూలు చేయాల్సి ఉంది.

స్క్రీన్ కౌంట్, ఆక్యుపెన్సీ: ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమా మిడిల్ రేంజ్ బజ్ ఉండటంతో ఇండియాలో మధ్యస్థంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఇండియాలో దాదాపు 1000 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు పెద్దగా స్పందన కనిపించలేదు కానీ కరెంట్ బుకింగ్‌కు ఓ రేంజ్‌లో రెస్సాన్స్ వచ్చింది.
వికీ కౌశల్ మూవీ గురించి: ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ మూవీ కంటే ముందు వికీ కౌశల్ నటించిన సినిమా జరా హట్కే. ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా 5.5 కోట్ల రూపాయలు నమోదు చేసింది. అయితే ఆ సినిమాతో పోల్చుకొంటే ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ ఆ రేంజ్ కలెక్షన్లు రాబట్టలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వికీ కౌశల్ మూవీ కలెక్షన్లు: ఇక ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్లితే.. స్లో గా వసూళ్లు కనిపించాయి. తొలి రోజు ఈ సినిమా ఇండియాలో 3 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్‌గా 3.5 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సిన విషయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











