Vicky Vidya Ka Woh Wala Video Box Office: త్రిప్తి డిమ్రీ మూవీకి రికార్డు కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?
యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి డిమ్రీ నటించిన చిత్రం విక్కి విద్యా ఓ వాలా వీడియో. బాలీవుడ్ యువ హీరో రాజ్ కుమార్ రావ్ నటించిన ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించారు. ఈ మూవీని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్ ఫిల్మ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్, వాకూ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్, విపుల్ డీ షా సంయుక్తంగా రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి డిమ్రీ, రాజ్ కుమార్ రావుతోపాటు విజయ్ రాజ్, మల్లికా షెరావత్, అర్చన పూరన్ సింగ్, షెహనాజ్ గిల్, దలేర్ మహేంది తదితరులు నటించిన ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

వికీ విద్యా కా ఓ వాలా వీడియో మూవీ కథ విషయానికి వస్తే.. 1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. అయితే శోభనం రోజు రాత్రి వారికి చిలిపి కోరిక కలుగుతుంది. భవిష్యత్‌లో తమ ఫస్ట్ నైట్‌ను మరోసారి చూసుకోవడానికి ఆ మధురమైన రాత్రిని వీడియోలో బంధించాలనే కోరికతో షూట్ చేస్తారు. ఆ వీడియో సీడీ దొంగతనానికి గురి అవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరు దంపతుల పరిస్థితి ఏమిటనేది ఈ సినిమా కథ.
ఈ సినిమాలో పాపులర్ యాక్లర్లు, టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. ప్రముఖ సిని నిర్మాణ సంస్థలు నిర్మించడంతో క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా సుమారుగా 75 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

త్రిప్తి డిమ్రీ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలకు అనూహ్యమైన స్పందన ఆడియెన్స్ రావడంతో ఈ మూవీపై బజ్ పెరిగింది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా భారీగా వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 2000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీ నమోదైంది.
రాజ్ కుమార్ రావు నటించిన ఈ సినిమాకు ఇండియాలో 5 కోట్ల రూపాయల నికర వసూళ్లు నమోదు చేసింది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 9 నుంచి 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











