Sankranthiki Vasthunam Box Office: రామ్‌ చరణ్‌ రికార్డ్‌ బద్ధలు.. వసూళ్లలో వెంకటేష్ రేర్ ఫీట్ , ఎన్ని కోట్లంటే

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన వెంకటేష్ .. నలుగురు అగ్ర కథానాయకుల్లో చిరంజీవి తర్వాత రూ.200 కోట్లు అంతకంటే ఎక్కువ వసూళ్లు సాధించిన హీరోగా నిలిచారు. ఈ నేపథ్యంలో 10వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Victory Venkatesh Anil Ravipudi s Sankranthiki Vasthunam Box Office Collection Day 10

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించిన వెంకటేష్.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుని , నేటి వరకు అదే జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 94.45 కోట్ల షేర్‌ని రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. తాజాగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం లైఫ్ టైంలో తెలుగునాట రాబట్టిన రూ.95.27 కోట్ల షేర్‌ను దాటేసింది . ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి వసూలు చేసిన రూ. 106.4 కోట్ల షేర్‌ని బద్ధలు కొట్టే దిశగా అడుగులు వేస్తోంది.

సంక్రాంతి సెలవులు ముగిసినా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్నాంకు ఆక్యూపెన్సీ ఏమాత్రం తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద కొత్తగా ఏ చిత్రం లేకపోవడం వెంకటేష్ మూవీకి బాగా కలిసొస్తోంది. 10 రోజుల్లో దాదాపు రూ.80 కోట్లకు పైగా లాభాలను అందజేసింది. ఈ నేపథ్యంలో 10వ రోజైన గురువారం వర్కింగ్ డే కావడంతో సంక్రాంతికి వస్తున్నాం బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి.

అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు మంచి హోల్డ్ చూపించడంతో గురువారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 4.26 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ కలెక్షన్స్‌తో కలిపి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఇప్పటి వరకు రూ.230 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. మరి లాంగ్ రన్‌లో ఈ సినిమా ఇంకెన్ని లాభాలను కుమ్మరిస్తుందోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X