Sankranthiki Vasthunam Box Office : బాక్సాఫీస్‌ని వణికిస్తోన్న వెంకటేష్ .. 15వ రోజు ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్, హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటికే రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం .. రూ.300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో 15వ రోజు వెంకటేష్ చిత్రానికి ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే అలవోకగా టార్గెట్‌ను కొట్టేసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే బయ్యర్లకు రూ.100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమా .. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బడా ప్రొడ్యూసర్ దిల్‌రాజును ఒడ్డున పడేసింది.
ఇక గతేడాది సైంధవ్‌తో విమర్శలు ఎదుర్కొన్న వెంకటేష్ .. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సోలో హీరోగా ఎపిక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్‌లోని నలుగురు అగ్ర కథానాయకుల సినిమాలలో తెలుగు వెర్షన్‌కు గాను రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో చిరంజీవి రికార్డును బద్ధలు కొట్టి నెంబర్ వన్‌గా అవతరించాడు వెంకటేష్.
ఇకపోతే.. 14 రోజుల వరకు నైజాంలో రూ.37.64 కోట్లు, సీడెడ్‌లో రూ.16.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.61 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.12.66 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.15 కోట్లు, గుంటూరులో రూ.9.80 కోట్లు, కృష్ణాలో రూ.8.93 కోట్లు, నెల్లూరులో రూ. 4.27 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 117.52 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7.88 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.30 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.189.35 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.241.85 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక 15వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ ఎప్పటిలాగే పడిపోయాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తడంతో బుకింగ్స్ అందుకున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి మంగళవారం రూ. 3 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరి లాంగ్ రన్‌లో వెంకటేష్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











