Sankranthiki Vasthunam Box Office : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న వెంకటేష్ .. ఎన్ని కోట్లంటే?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి సీజన్‌లో క్లీన్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. నాలుగు రోజుల్లోనే రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచింది. మరి 5వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే :
కామెడీ, పాటలు, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండటంతో పండుగ సీజన్‌లో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవర్సీస్‌లోనూ సంక్రాంతి వస్తున్నాం మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా అందుకుంది. వసూళ్లే కాదు.. మూడు రోజుల్లో రూ. 1.5 మిలియన్ టికెట్లు తెగినట్లు బుక్ మై షో అధికారికంగా ప్రకటించింది. సినిమాకు వస్తున్న ఆదరణ దృష్ట్యా అదనపు షోలను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

అలా వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం దిశగా అడుగులు వేస్తోంది . అంతేకాదు.. వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వరుసగా మూడు సార్లు రూ.100 కోట్ల మార్క్ సాధించి హ్యాట్రిక్ కొట్టారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొట్టేసి లాభాల్లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం.. లాంగ్ రన్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఐదో రోజైన శనివారం .. వస్తున్నాం సంక్రాంతికి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తద్వారా 5 రోజుల్లోనే రూ.161 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఈ సినిమా ఊపు చూస్తే జనవరి ఎండింగ్ వరకు ఇదే జోరు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











