Sankranthiki Vasthunam Box Office : ఫెస్టివల్ ముగిసినా కుమ్మేస్తోందిగా.. వెంకటేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచుతోన్న ఈ సినిమా మరిన్ని వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్ మూవీ 8వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లో ఛేదించి లాభాల్లోకి అడుగుపెట్టింది సంక్రాంతికి వస్తున్నాం.
తొలి వారంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. నైజాంలో రూ. 27.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.73 కోట్లు, ఈస్ట్‌లో రూ.9.72 కోట్లు, వెస్ట్‌లో రూ. 6.45 కోట్లు, కృష్ణాలో రూ. 7.18 కోట్లు, గుంటూరులో రూ.7.90 కోట్లు, నెల్లూరులో రూ. 3.28 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లు చొప్పున రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ. 160 కోట్ల గ్రాస్ వసూళ్లతో .. రూ. 80 కోట్లకు పైగా లాభాలను బయ్యర్లకు అందించాడు వెంకటేష్. ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ ఇలా ఎక్కడ చూసినా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్మురేపుతోంది. తొలి వారంలో నార్త్ అమెరికాలో 2.3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

ఇకపోతే.. 8వ రోజు ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. వర్కింగ్ డే కావడంతో దాదాపు 60 శాతం మేర బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. అయితే క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లోని మల్లీప్లెక్స్‌లలో ఫస్ట్ షో, సెకండ్ షో సమయాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటంతో వెంకటేష్ సాలీడ్ వసూళ్లు రాబడుతున్నాడు. తాజా మంగళవారం సెకండ్ వర్కింగ్ డే అయినప్పటికీ మంచి హోల్డ్ చూపించింది ఈ సినిమా. 8వ రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రూ.8 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరి లాంగ్ రాన్‌లో వెంకటేష్ ఎక్కడ ముగిస్తాడో చూడాలి. ప్రస్తుతానికైతే చిత్ర యూనిట్ ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











