Sankranthiki Vasthunam Day 10 Collection:వెంకీ మామనా మజాకా.. 10 రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Sankranthiki Vasthunam Day 10 Collection: విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie). ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలవడంతో పాటు నిర్మాత దిల్‌రాజ్ కంపెనీకి తిరిగి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో 10వ రోజు (Vasthunam Box office Day 10 Expected collection) ఎన్ని కోట్లు సాధించిందనే వివరాల్లోకెళ్తే..

సంక్రాంతికి వస్తున్నాంలో టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనటర్ గా వచ్చిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Victory Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunam Box office Day 10 Expected collection Report

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', నందమూరి బాలకృష్ణ'డాకు మహారాజ్‌' లాంటి భారీ సినిమా నుంచి టాప్ ఫైట్ ను ఎదుర్కొంది. సినిమాకు పాజిటివ్ టాక్‌ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఎవ్వరూ ఊహించని విధంగా
విక్టరీ వెంకటేష్ సినిమా తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించింది. ప్రస్తుతం లాభాల బాటలో పరుగులు పెడుతోంది.

Victory Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunam Box office Day 10 Expected collection Report

సంక్రాంతికి వస్తున్నాం రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. సంక్రాంతికి వస్తున్నాం తొలి వారంలో రూ.203 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 160.4 కోట్లు, కర్ణాటకలో రూ. 8.4 కోట్లు, తమిళనాడులో రూ. 1.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.26 కోట్లు చొప్పున కలెక్షన్స్ రాబట్టింది. ఇక 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.222 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. హీరో వెంకటేశ్ తొలిసారి రూ.200కోట్ల క్లబ్‍లో అడుగుపెట్టారు. విజయవంతంగా రెండో వారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం వర్కింగ్ డేస్‌లోనూ అదే జోరు కనిపిస్తోంది. ఇకపోతే.. 10 రోజు ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. వర్కింగ్ డే కావడంతో దాదాపు 50 శాతం మేర బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. గురువారం వెంకటేష్ సినిమాకు రూ. 4 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X