Sankranthiki Vasthunam Box Office: వీకెండ్ లో వెంకీ మామ వసూళ్ల జాతర .. 13 వ రోజు ఎన్ని కోట్లంటే?
Sankranthiki Vasthunam Day 13 Collection: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ రావడంతో ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో వెంకీ మామ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో వారాన్ని కూడా విజయవంతంగా ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 13 రోజు (Sankranthiki Vasthunam Box office Day 13 Expected collection) ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకెళ్తే..
టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు ఇక ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలో దిగిన వెంకటేష్ చిత్రం మూడు రోజుల్లోనే లక్ష్యాన్ని కొట్టిపడేసింది. ఇప్పటికే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.100 కోట్లకు పైగా లాభాలను పంచిపెట్టింది సంక్రాంతికి వస్తున్నాం.
ఇక సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలిరోజు ఏకంగా రూ. 45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌గా నిలిచింది. ఇక రెండో రోజు సంక్రాంతికి వస్తున్నాం రూ. 20.99 కోట్లు, 3వ రోజు రూ. 17.5 కోట్లు, 4 వ రోజు 16 కోట్లు, 5వ రోజు రూ. 17.75 కోట్లు, 6వ రోజు రూ. 19.35 కోట్లు, 7వ రోజు రూ. 8.4 కోట్లు, 8వ రోజు రూ. 6.75 కోట్లు, 9వ రోజు రూ. 4.75 కోట్లు, 10వ రోజు రూ. 3.8 కోట్లు, ఇలా మొదటి వారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 137.3 రాబట్టింది. ఇక 11 వరోజు 3.6 కోట్లు అందుకుంది. ఇక వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగాయి.12 రోజు రూ. 6.3 కోట్లు రాబట్టింది.

ఇక 13వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే శనివారం వీకెండ్ కావడంతో సాలీడ్ బుకింగ్స్ నమోదయ్యాయి. 13వ రోజు సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 6.65 కోట్ల వసూల్లు అందుకున్నట్టు తెలుస్తోంది. ఇలా 13 డే కలెక్షన్ కలుపుకొని సంక్రాంతికి వస్తున్నాం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 155 కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది. వీకెండ్ కావడంతో ఫస్ట్, సెకండ్ షో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని థియేటర్ల సంఖ్యను పెంచేందుకు నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











