Sankranthiki Vasthunam Collection: రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న వెంకీ మామ.. 14వ రోజు కలెక్షన్స్ ఎన్ని కో
Sankranthiki Vasthunam Day 14 Collection: విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam ). సంక్రాంతికి కానుకగా విడుదలైన జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. రిలీజ్‌కు ముందే హిట్ టాక్ సొంతం చేసుకొన్న ఈ సినిమా కలెక్షన్లు సునామినీ క్రియేట్ చేస్తుంది. దీంతో వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి ప్రూ అయింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 14వ రోజు ( Sankranthiki Vasthunam Box office Day 14 Expected collection) ఎన్ని కోట్లు కలెక్షన్ వివరాల్లోకెళ్తే..
టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అనిల్ రావిపూడి,దిల్ రాజు, వెంకటేష్ కాంబో పర్పెక్ట్ సెట్ కావడంతో రికార్డ్ విజయాన్ని అందుకొంటున్నది.

అనిల్ రావిపూడి,దిల్ రాజు, వెంకటేష్ కాంబో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు రూ. 85 కోట్లుగా నిర్ణయించారు. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని 1300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. .
ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. దీంతో వెంకటేష్ కెరీర్‌లో హైయ్యేస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం. అలాగే..పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఇండియాలోనే కాదు. ఓవర్సీస్ జోష్‌ను కొనసాగిస్తున్నది. ప్రధానంగా నార్త్ అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ క్రమంలో ఈ మూవీ 4 రోజుల్లో ప్రపంచం వ్యాప్తంగా రూ. 131 కోట్లు వసూలు చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఐదవ రోజు సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ.12.75 కోట్లు వసూలు చేసి.. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో RRR (రూ.16.63 కోట్లు)ఉంది. అలాగే.. 12వ రోజు రూ. 4.88 కోట్ల షేర్‌తో టాప్ 2లో ఉన్న ఆర్ఆర్ఆర్‌ను .. సంక్రాంతికి వస్తున్నాం రూ.4.90 కోట్ల షేర్‌తో వెనక్కి నెట్టింది. అలాగే.. 13 రోజులల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన రెండో హీరోగా విక్టరీ వెంకటేష్ నిలిచారు. నిలిచారు.
ఇలా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఇండియాలో రూ. 176 కోట్ల గ్రాస్ అందుకోగా.. ప్రపంచవ్యాప్తంగా నికరంగా 253 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. అలాగే.. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 275 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం 14 రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే..భారీ బుకింగ్స్ నమోదయ్యాయి. దీంతో నేడు రూ.2.52 కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇవి మార్నింగ్, మాట్నీ షోల వివరాలు మాత్రమే. ఇక ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్స్ వివరాలు వస్తే.. కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశముంది. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది.


Click it and Unblock the Notifications











