Sankranthiki Vasthunam Collection: హిస్టరీ క్రియేట్ చేసిన వెంకీ మామ.. 17వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Sankranthiki Vasthunam Day 17 Collection: విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie). ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల దుమ్ముదులుపుతోంది. తొలి వారంలోనే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, ప్రస్తుతం రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తున్న ఈ మూవీ ..సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 17వ రోజు (Vasthunam Box office Day 17 Expected collection) ఎన్ని కోట్లు సాధించిందనే వివరాల్లోకెళ్తే..
టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీలో నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనటర్ గా వచ్చిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డుల దుమ్ముదులుపుతోంది. తన పని ఇక అయిపోయింది అన్న విమర్శలకు టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవరికీ లేని వసూళ్లు సాధించిన హీరోగానూ నిలిచాడు. దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం వెంకటేష్ కే కాదు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా 8వ విజయాన్ని అందించింది. కేవలం రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించింది. ప్రస్తుతం రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది.

సంక్రాంతికి వస్తున్నాం రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఈ మూవీ తొలివారంలో రూ.203 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 160.4 కోట్లు, కర్ణాటకలో రూ. 8.4 కోట్లు, తమిళనాడులో రూ. 1.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.26 కోట్ల మేర వసూలు అందుకుంది. ఇక 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.222 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి.. హీరో వెంకటేశ్ కెరీర్ లో తొలిసారి రూ.200కోట్ల క్లబ్‍లో అడుగుపెట్టిన మూవీగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిలిచింది.
రెండో వారంలోనూ అదే జోరు కనబరించింది. ఈ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి సైరా నర్సింహారెడ్డి రికార్డును బ్రేక్ చేశారు వెంకటేష్, సైరా నర్సింహా రెడ్డి టోటల్ థియేట్రికల్ రన్‌లో రూ.143.8 కోట్ల షేర్ రాబట్టగా.. వెంకటేష్ మూవీ కేవలం 15 రోజుల్లోనే రూ.142.53 కోట్ల షేర్‌ను అందుకుంది. దీంతో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆల్‌టైం హయ్యెస్ట్ షేర్‌ను అందుకున్న హీరోగా నిలిచారు విక్టరీ వెంకటేష్ నిలిచారు.
ఇక 17వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వస్తే.. వర్కింగ్ డే కావడంతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ బుకింగ్స్ దాదాపు 60 శాతం మేర డ్రాప్ అయ్యాయి.దీంతో గురువారం వెంకటేష్ సినిమాకు రూ. 1.2 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వస్తాయని, దీంతో వెంకీ మామ సినిమా రూ. 170 కోట్ల షేర్ క్రాస్ చేస్తున్నందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ వీకెండ్ లో కూడా వెంకీ మామ తన జోరు కొనసాగిస్తాడని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











