Sankranthiki Vasthunam Collection: మళ్ళీ వెంకీ మాస్ బ్యాటింగ్.. 18వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Sankranthiki Vasthunam Day 18 Collection: విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి ల కాంబోలో తెరకెక్కిన మూవీ ' సంక్రాంతికి వస్తున్నాం ' (Sankranthiki Vasthunam). సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపిస్తోంది. తొలి వారంలోనే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, ప్రస్తుతం రూ.300 కోట్ల దిశగా పరుగులు దీస్తోంది సంక్రాంతికి వస్తున్నాం. అత్యధిక వసూలు రాబట్టి విన్నర్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ నేపథ్యంలో 18వ రోజు (Vasthunam Box office Day 18 Expected collection) ఎంత కలెక్ట్ చేసిందనే వివరాల్లోకెళ్తే..

టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనటర్ గా వచ్చిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Victory Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunam Box office Day 18 Expected collection Report

సంక్రాంతికి వస్తున్నాం రూ. 42 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. పాజిటివ్ టాక్ అందుకోవడంతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డుల పరంగా దుమ్మురేపుతోంది. ఇక విక్టరీ వెంకటేష్ పని అయిపోయిందనే సందర్భంలో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవరికీ లేని వసూళ్లు సాధించిన హీరోగా వెంకటేష్ నిలిచారు. సంక్రాంతి సెలవుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయింది. వేగంగా రూ. 100 , రూ.200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి.. విమర్శకుల నోర్లుమూయించాడు వేంకీ మామ.

అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మిలియన్ డాలర్ల వర్షం కురిపిస్తోంది. ఫెస్టివల్ సీజన్ ముగిసినా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కారణంగా ఈ మూవీ తొలివారంలో రూ.203 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 160.4 కోట్లు, కర్ణాటకలో రూ. 8.4 కోట్లు, తమిళనాడులో రూ. 1.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.26 కోట్ల మేర వసూలు అందుకుంది. ఈ చిత్రం రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా లాభాలను పంచింది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హీరోగా వెంకటేష్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది.

Victory Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunam Box office Day 18 Expected collection Report

ఇక 18వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వస్తే.. శుక్రవారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటం, మరో పెద్ద సినిమా లేకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కలెక్షన్స్ మరోసారి పెరిగాయి. నిన్నటి కంటే.. బుకింగ్స్ దాదాపు 60 శాతం మేర పెరిగాయి. దీంతో శుక్రవారం వెంకటేష్ సినిమాకు రూ. 1.5 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వస్తాయని, దీంతో వెంకీ మామ సినిమా రూ. 170 కోట్ల షేర్ క్రాస్ చేస్తున్నందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ వీకెండ్ లో కూడా వెంకీ మామ తన జోరు కొనసాగిస్తాడని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X