Sankranthiki Vasthunam Day 1 Collection:వెంకీ మామనా మజాకా.. రెండో రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Sankranthiki Vasthunam Day 2 Collection: విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie). ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు అన్ని షోలు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. అయితే.. ఈ సినిమా రెండో రోజు (Vasthunam Box office Day 2 Expected collection) ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకెళ్తే..
టాలీవుడ్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. విడుదలకు ముందు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తో భారీ అంచనాలను పెంచేశాయి.

వాస్తవానికి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', నందమూరి బాలకృష్ణ'డాకు మహారాజ్', ఇప్పటికే థియేటర్‌లో ఉన్న అల్లు అర్జున్ పుష్ప 2, ఉపేంద్ర యూఐ, ఉన్ని ముకుందన్‌ల మార్కోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇలాంటి టాప్ ఫైట్ లో జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం ' సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా సినిమాకు అంతటా యునానిమస్ టాక్ రావడంతో మూవీ మేకర్స్ ప్రేక్షకులకు కృతజ్జతలు తెలియజేశారు.
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది.

ఇక సంక్రాంతికి వస్తున్నాం మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 16 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రూ. 2 కోట్లు .. మొత్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌గా నిలిచింది. ఇక రెండో రోజు సంక్రాంతికి వస్తున్నాం రూ. 14.99 కోట్లు వసూల్లు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్దం ₹ 37.99 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. ఇప్పటి వరకు మార్నింగ్, మాట్నీ షోల వివరాలు మాత్రమే. ఇక ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్స్ వివరాలు రాలేదు. ఈ రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది.


Click it and Unblock the Notifications











