Sankranthiki Vasthunam Box Office : వీకెండ్ లో వెంకీ మామ ఊచకోత .. 20వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Sankranthiki Vasthunam Day 20 Collection: టాలీవుడ్ లో అత్యధిక విజయాలు అందుకున్న హీరో గా విక్టరీ వెంకటేష్ నిలిచారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరూ నెలకొల్పని సంచలన రికార్డును వెంకీమామ నెలకొల్పారు. అందుకే.. వెంకటేష్ పేరు ముందు 'విక్టరీ' అనే ట్యాగ్ వేశారు. తాజాగా జనవరి 14వ తేదీన సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 20 వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే :
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా... నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా..ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దాదాపు రూ. 42 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో రూ. 85 కోట్లు గా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా తొలి ఆటకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రికార్డుల దుమ్ముదులుపుతోంది. విక్టరీ వెంకటేష్ పని ఇక అయిపోయింది అన్న విమర్శకుల నోళ్లు మూయించింది.
ఇప్పటివరకూ దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం వెంకటేష్ కే కాదు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా 8వ విజయాన్ని అందించింది. కేవలం రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించింది. ప్రస్తుతం రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఈ మూవీ తొలివారంలో రూ.203 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.222 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి.. వెంకటేశ్ కెరీర్ లో తొలిసారి రూ.200కోట్ల క్లబ్‍లో అడుగుపెట్టిన మూవీగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిలిచింది. మూడో వారంలోనూ అదే జోరు కనబరించింది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆల్‌టైం హయ్యెస్ట్ షేర్‌ను అందుకున్న హీరోగా నిలిచారు విక్టరీ వెంకటేష్ నిలిచారు.
ఇక 20 వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వస్తే.. వీకెండ్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ బుకింగ్స్ దాదాపు 60 శాతం పెరిగాయి. డే 19, డే 20 కూడా కలెక్షన్స్ జోరందుకున్నాయి.శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా రూ. 3 కోట్ల గ్రాస్ అందుకోగా.. ఆదివారం కలెక్షన్లు మరింత పుంజుకుంటాయి. నేడు రూ. 3.5 కోట్ల గ్రాస్ అందుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ సంక్రాంతికి వస్తున్నాం.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 122.35 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.95 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లు గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.


Click it and Unblock the Notifications











