Sankranthiki Vasthunam : రూ. 300 క్లబ్ లో చేరిన సంక్రాంతికి వస్తున్నాం.. 21వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Sankranthiki Vasthunam Day 21 Collection: సంక్రాంతి రేసులో నిలిచిన విక్టరీ వెంకటేష్ భారీ విజయం అందుకున్నారు. ఆయన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam) సినిమా ఎవరూ ఊహించలేని విధంగా రికార్డు కలెక్షన్స్ అందుకుంది. తాజాగా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను దుమ్ము దులుపుతోంది. దాదాపు రూ. 300 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 21 వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడిల కాంబోలో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Victory Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunam Box office Day 21 Expected collection Report

ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దాదాపు రూ. 42 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో రూ. 85 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. విక్టరీ వెంకటేష్ పని ఇక అయిపోయిందన్న విమర్శకుల నోళ్లు మూయించింది. వెంకటేష్ యాక్టింగ్, బుల్లిరాజు మెరుపులు, పాటలు, అనిల్ రావిపూడి టేకింగ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రికార్డుల దుమ్ముదులుపుతోంది.

కేవలం రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది. సంక్రాంతికి వస్తున్నాం కనివినీ ఎరుగని వసూళ్లతో ఈ ఏడాది సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ఇక బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూలు చేసిన రీజనల్‌ సినిమాగా 'సంక్రాంతికి వస్తున్నాం' రికార్డు క్రియేట్ చేసింది. రీజనల్‌ సినిమాల పరంగా ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలించింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా 20 రోజుల్లో రూ.303 కోట్ల సాధించి, సంక్రాంతి విన్నర్ గా నిలిచిందని మేకర్స్‌ ప్రకటించారు. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది. ఈ సినిమా కేవలం వెంకటేష్ కే కాదు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా 8వ విజయాన్ని అందించింది. అలాగే.. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అత్యధిక కలెక్షన్ల వసూలు చేసిన హీరో గా విక్టరీ వెంకటేశ్ రికార్డు సృష్టించారు. సీనియర్ హీరోల్లో తొలిసారి రూ.300కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన ఘనత వెంకీ మమాకే దక్కింది.

ఇక 21వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. వర్కిండ్ డే కావడంతో వసూలు తగ్గాయి. అయినా రూ. కోట్ల వరకు వసూలు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్ లో దుమ్మురేపిన వెంకీ మామ వర్కింగ్ డేస్ లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X