Sankranthiki Vasthunam Box Office: రికార్డుల వేటలో వెంకీమామ.. 22వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Sankranthiki Vasthunam Day 22 Collection: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. సంక్రాంతి కానుకగా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. సంక్రాంతి రేసులో నిలిచిన విక్టరీ వెంకటేష్ కు భారీ విజయం అందుకున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఎవరూ ఊహించలేని విధంగా రికార్డు కలెక్షన్స్ అందుకుంది. దాదాపు రూ. 300 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ 22వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీ.టీ.ఎస్.గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Victory Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunam Box office Day 22 Expected collection Report

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దాదాపు రూ. 42 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో రూ.85 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. విక్టరీ వెంకటేష్ పని ఇక అయిపోయిందన్న విమర్శకుల నోళ్లు మూయించింది. వెంకటేష్ యాక్టింగ్, బుల్లిరాజు మెరుపులు, పాటలు, అనిల్ రావిపూడి టేకింగ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రికార్డుల దుమ్ముదులుపుతోంది.

'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది. సంక్రాంతికి వస్తున్నాం కనివినీ ఎరుగని వసూలు రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ఇక బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూలు చేసిన రీజనల్‌ సినిమాగా 'సంక్రాంతికి వస్తున్నాం' రికార్డు క్రియేట్ చేసింది. రీజనల్‌ సినిమాల పరంగా ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌గా నిలించింది.

అలాగే.. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 20 రోజుల్లో రూ.303 కోట్ల సాధించి మూవీ మేకర్స్‌ ప్రకటించారు. రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది. ఈ సినిమా కేవలం వెంకటేష్ కే కాదు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వరుసగా 8వ విజయాన్ని అందించింది. మరోవైపు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అత్యధిక కలెక్షన్ల వసూలు చేసిన హీరో గా విక్టరీ వెంకటేశ్ రికార్డు సృష్టించారు. సీనియర్ హీరోల్లో తొలిసారి రూ.300 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన ఘనత వెంకీ మమాకే దక్కింది.

Victory Venkatesh Anil Ravipudi Sankranthiki Vasthunam Box office Day 22 Expected collection Report

అలాగే.. సంకాంత్రికి వస్తున్నాం సినిమా ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. బుక్ మై షోలో ఈ మూవీ కోసం ఏకంగా 3.5 మిలియన్ టికెట్ బుకింగ్స్ జరిగినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ఇక 22వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే..ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా, దీని క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంకా ఆసక్తిని చూపుతున్నారు. అయితే.. వర్కింగ్ డే కావడంతో వసూలు కాస్త తగ్గాయి. మంగళవారం రూ. 2 కోట్ల వరకు వసూలు సాధించబోతున్నదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి వెంకీ మామ రికార్డుల వేట కొనసాగిస్తున్నారనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X