Sankranthiki Vasthunam Box Office: బాక్సాఫీస్ ను షేకాడిస్తున్న వెంకీ మామ.. 23 వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే
Sankranthiki Vasthunam Day 23 Collection: విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. సంక్రాంతి రేసులో నిలిచిన విక్టరీ వెంకటేష్ కు ఊహించని సక్సెస్ ను అందించింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోతమోగిస్తుంది. మూడు వారాల్లోనే ఏకంగా రూ.303 కోట్ల వసూళ్లతో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ నేపథ్యంలో 23 వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
అనిల్ రావిపూడిల దర్శకత్వంలో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) సినిమలో విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' బడ్జెట్ విషయానికి వస్తే.. సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దాదాపు రూ. 42 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు రూ. 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. విక్టరీ వెంకటేష్ పని ఇక అయిపోయిందన్న విమర్శకుల నోళ్లు మూయించింది. వెంకటేష్ యాక్టింగ్, బుల్లిరాజు మెరుపులు, పాటలు, అనిల్ రావిపూడి టేకింగ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రికార్డుల దుమ్ముదులుపుతోంది.
కేవలం రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఎవ్వరూ ఊహించని విధంగా తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసింది. సంక్రాంతికి వస్తున్నాం కనివినీ ఎరుగని వసూళ్లతో ఈ ఏడాది సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ఇక బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు చేసిన రీజనల్ సినిమాగా 'సంక్రాంతికి వస్తున్నాం' రికార్డు క్రియేట్ చేసింది. రీజనల్ సినిమాల పరంగా ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలించింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా 20 రోజుల్లో రూ.303 కోట్ల సాధించి, సంక్రాంతి విన్నర్ గా నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కేవలం వెంకటేష్ కే కాదు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా 8వ విజయాన్ని అందించింది. అలాగే.. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అత్యధిక కలెక్షన్ల వసూలు చేసిన హీరో గా విక్టరీ వెంకటేశ్ రికార్డు సృష్టించారు. సీనియర్ హీరోల్లో తొలిసారి రూ.300కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన ఘనత వెంకీ మమాకే దక్కింది.
ఇక 23వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. వర్కిండ్ డే కావడంతో వసూలు తగ్గాయి. అయినా రూ.2 కోట్ల గ్రాస్ వసూలు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్ లో దుమ్మురేపిన వెంకీ మామ వర్కింగ్ డేస్ లో ప్రభావం కాస్త తగ్గింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.205.05 కోట్లు గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.153 కోట్లకు పైగా షేర్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్మురేపుతోంది. ఈ వారం నాగచైతన్య నటించిన తండేల్ సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ కానుండటంతో సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











