Sankranthiki Vasthunam Day 5 Collection: ‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల సునామీ.. ఐదో రోజు కలెక్షన్స్ ఎన
Sankranthiki Vasthunam Day 5 Collection: విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి ల కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie). ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో వీరి కాంబినేషన్‌కు తిరుగులేదని మరోసారి ప్రూ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతూ ఉండటంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే.. ఈ సినిమా ఐదవ రోజు (Vasthunam Box office Day 5 Expected collection) ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకెళ్తే..
టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సంక్రాంతికి వస్తున్నాం మూవీకి దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. దీంతో వెంకటేష్ కెరీర్‌లో హైయ్యేస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం. ఇక రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్లు, ఈ సమయంలోనే 3 రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక నాలుగో రోజు రూ. 16 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం మూవీ 4 రోజుల్లో ప్రపంచం వ్యాప్తంగా రూ. 131 కోట్లు వసూలు చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇక సంక్రాంతికి వస్తున్నాం 5 రోజు కలెక్షన్ల వివరాలకు వస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 11. 52 కోట్లు అందుకుంది. దీంతో వెంకీ మూవీ ఐదు రోజుల్లో రూ. 88.02 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇవి మార్నింగ్, మాట్నీ షోల వివరాలు మాత్రమే. ఇక ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్స్ వివరాలు రాలేదు. ఈ రెండు షోల కలెక్షన్లు వివరాలు వస్తే.. కలెక్షన్లలో భారీ మార్పులు వచ్చే అవకాశముంది.
ఏదిఏమైనా.. 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్'లాంటి భారీ బడ్జెట్ మూవీస్ థియేటర్లో ఉండగా.. ఇలాంటి టఫ్ సిచ్వేషన్స్ లో వచ్చిన విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు పాజిటివ్ టాక్ అందుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా విక్టరీ వెంకటేష్ సినిమాకు అంతటా యునానిమస్ టాక్ వచ్చింది. ఫైనల్ గా సంక్రాంతి విన్నర్ గా విక్టరీ వెంకీ- అనిల్ రావిపూడి కాంబో నిలిచింది.


Click it and Unblock the Notifications











