Sankranthiki Vasthunam Box Office : బాక్సాఫీస్‌పై వెంకటేష్ దండయాత్ర .. 6వ రోజు ఎన్ని కోట్లంటే?
కామెడీ సినిమాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 5 రోజులకే ఏకంగా రూ. 161 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా .. రూ. 200 కోట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం 6వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 1300 స్క్రీన్లలో సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశారు. ఫస్ట్ డే రూ.45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.161 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పండగపూట ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన విందు భోజనం లాంటి ఎలిమెంట్స్ ఉండటంతో కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ఖుషీ అవుతోంది.

సంక్రాంతి సెలవులు, వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న వెంకటేష్ - అనిల్ రావిపూడిల చిత్రం సాలీడ్ వసూళ్లు రాబడుతోంది. 6వ రోజైన ఆదివారం ఈ సినిమాకు రూ. 23 కోట్ల గ్రాస్ దక్కింది. అటు నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తొలి వారంలోనే 2 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టి 2.5 మిలియన్ల వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తంగా 6 రోజుల వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 180 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సాలీడ్ ప్రాఫిట్స్‌ను అందిస్తోంది. మరి లాంగ్ రన్‌లో వెంకీ మామ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











