Sankranthiki Vasthunam Box Office : వెంకీ వసూళ్ల జాతర .. మెగా రికార్డ్‌కి ఎసరు, 11వ రోజు ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి వెంకీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి రూ.300 కోట్ల మార్క్ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో 11వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం మూడు రోజుల్లోనే అలవోకగా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా లాభాల పంట పండిస్తోంది.
కేవలం 10 రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా షేర్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. దాదాపు 78.38 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ 10 రోజుల వ్యవధిలో నైజాంలో రూ.31.18 కోట్లు, సీడెడ్‌లో రూ.14.57 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.15.81 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.11.32 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.05 కోట్లు, గుంటూరులో రూ.8.92 కోట్లు, కృష్ణాలో రూ.8.07 కోట్లు, నెల్లూరులో రూ. 3.76 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14 కోట్లతో మొత్తంగా 120.88 కోట్ల షేర్ .. రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ.98 కోట్ల షేర్ రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి షేర్ (105 కోట్లు)ను బద్ధలుకొట్టే దిశగా పరుగులు తీస్తోంది. ఈ వీకెండ్‌లోగా ఈ రికార్డును వెంకటేష్ కొట్టేస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 11వ రోజు వసూళ్ల విషయానికి వస్తే శుక్రవారం ఉదయం, మ్యాట్నీ ఆటలకు బుకింగ్స్ భారీగా పడిపోయాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షో నుంచి మల్టీప్లెక్స్‌ల్లో టికెట్లు బాగా తెగాయి. మొత్తంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా వెంకటేష్ సినిమాకు రూ. 4 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాంకు కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











