Sankranthiki Vasthunam Box Office : మెగా రికార్డ్ ఔట్ .. వసూళ్లలో నెం.1గా వెంకటేష్ , ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమాకు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు వెంకటేష్ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో 14వ రోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయి? రెండు వారాలకు గాను వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. కేవలం మూడు రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. తద్వారా డిస్ట్రిబ్యూటర్లకు రూ.100 కోట్లకు పైగా లాభాలను పంచుతోంది .
ఇకపోతే.. 13 రోజుల వరకు నైజాంలో రూ.37.10 కోట్లు, సీడెడ్‌లో రూ.16.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.11 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.12.48 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.05 కోట్లు, గుంటూరులో రూ.9.70 కోట్లు, కృష్ణాలో రూ.8.81 కోట్లు, నెల్లూరులో రూ. 4.20 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 115.61 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.15 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.186.20 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది.
ఇప్పటికే వసూళ్ల బెండు తీస్తోన్న విక్టరీ వెంకటేష్ తాజాగా తన పేరిట మరో రికార్డును రాసుకున్నాడు. టాలీవుడ్‌లోని నలుగురు అగ్ర కథానాయకుల సినిమాలలో తెలుగు వెర్షన్‌కు గాను ఆల్ టైం హైయెస్ట్ షేర్ అండ్ గ్రాస్‌ను సొంతం చేసుకున్నాడు వెంకీ. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి ఇప్పటి వరకు రూ.236.40 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉండేది. ఇప్పుడు దాదాపు రూ. 240 కోట్లకు పైగా షేర్‌తో ఈ రికార్డును వెంకటేష్ బద్ధలు కొట్టారు.
ఇక 14వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ పడిపోయాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ బాగుండటంతో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ సోమవారం రూ. 4 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్మురేపింది. మరి వెంకటేష్ లాంగ్ రన్‌లో ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











