Sankranthiki Vasthunam Box Office : చిరంజీవిని దాటేసిన వెంకీ.. కలెక్షన్స్‌లో ఆల్‌టైం రికార్డ్, ఎన్ని కోట్లంటే
విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రికార్డుల దుమ్ముదులుపుతోంది. దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు వెంకీ. తన పని ఇక అయిపోయింది అన్న విమర్శలకు టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవరికీ లేని వసూళ్లు సాధించిన హీరోగానూ నిలిచాడు. ఈ సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా 8వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని తనది 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని చెబుతున్నాడు. రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం 16వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. కేవలం 3 రోజుల్లోనే టార్గెట్ కొట్టేసిన సంక్రాంతికి వస్తున్నాం . బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎక్కడ ఆగుతుందోనంటూ మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇకపోతే.. 15 రోజుల వరకు నైజాంలో రూ.38.12 కోట్లు, సీడెడ్‌లో రూ.16.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.19.94 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.12.80 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.25 కోట్లు, గుంటూరులో రూ.9.88 కోట్లు, కృష్ణాలో రూ.9.02 కోట్లు, నెల్లూరులో రూ. 4.32 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 119.04 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7.94 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.55 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.191.70 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.248 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.
ఈ కలెక్షన్ల వర్షంతో వెంకటేష్ మరో రికార్డును బద్ధలుకొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి టోటల్ థియేట్రికల్ రన్‌లో రూ.143.8 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు వెంకటేష్ కేవలం 15 రోజుల్లోనే రూ.142.53 కోట్ల షేర్‌ను అందుకుని సైరా రికార్డును క్రాస్ చేసింది. దీంతో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఆల్‌టైం హయ్యెస్ట్ షేర్‌ను అందుకున్న హీరోగా నిలిచారు వెంకీ. ఇక 16వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ మూవీ బుధవారం రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూద్దాం .


Click it and Unblock the Notifications











