Sankranthiki Vasthunam Box Office : వెంకటేష్ మూవీకి అన్‌స్టాపబుల్ కలెక్షన్స్ , ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్ హీరోగా , కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. మూడు వారాల్లోనే రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మరో రెండ్రోజుల్లో మూడో వారం పూర్తి చేసుకోబోతోన్న సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300 కోట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో 18వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
అలవోకగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసిన వెంకటేష్ బాక్సాఫీస్‌ను ఊచకోత కోశాడు. కేవలం రెండో వారం మధ్యలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి విశ్లేషకులకు షాకిచ్చాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మిలియన్ డాలర్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో 16 రోజుల్లోనే ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే బయ్యర్లకు రూ. 100 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టింది సంక్రాంతికి వస్తున్నాం.
ఇకపోతే.. 17 రోజుల వరకు నైజాంలో రూ.38.90 కోట్లు, సీడెడ్‌లో రూ.17.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.20.41 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.02 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.38 కోట్లు, గుంటూరులో రూ.9.97 కోట్లు, కృష్ణాలో రూ.9.14 కోట్లు, నెల్లూరులో రూ. 4.39 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 121.34 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.80 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.195.60 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. మరో 5 కోట్లు వస్తే .. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం (రూ.256 కోట్లు) గ్రాస్ రికార్డును బద్ధలు కొట్టనుంది. ఈ వీకెండ్‌కే పని పూర్తి చేయాలని వెంకీ దూకుడుగా వెళ్తున్నాడు.
ఇక 18వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా గురువారం రూ. 1.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శనివారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటం, మరో పెద్ద సినిమా లేకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇప్పట్లో ఎదురులేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద వెంకటేష్ చిత్రం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











